Nani Remuneration: ప్యారడైజ్ కు నాని రెమ్యునరేషన్.. భారీగా పెరిగిన పారితోషికం.. ఎన్ని కోట్లంటే?
నేచురల్ స్టార్ నాని టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా ఎదిగిన సంగతి అందరికీ తెలిసిందే. నాని నుంచి ఒక సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ రిటర్న్స్ మినిమమ్ ఉంటుందనేది ట్రేడ్ వర్గాల అంచనా. అందుకు కారణం నాని ఎంచుకునే కథలు. తెలుగు ఆడియెన్స్, తనకంటూ ఏర్పడ్డ సెపరేట్ ఫ్యాన్ బేస్ కు నచ్చేలా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇక ప్రస్తుతం నాని మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోగా మారిపోయారు. దీంతో ఆయన రాబోయే చిత్రం ప్యారడైజ్ కు ఎన్ని కోట్ల పారితోషికం తీసుకుంటున్నారనేది ఆసక్తికరంగా ఆ వివరాల్లోకి వెళితే..
అలా సెన్సేషన్..
ప్రస్తుతం నాని టాలీవుడ్ లో టైర్ 2 హీరోగా ఉన్నారని సినీ ప్రముఖులు అంటుంటారు. కానీ శ్యామ్ సింగరాయ్ చిత్రం నుంచి నాని చేస్తున్న ప్రతి సినిమా ప్రేక్షకులను మెప్పిస్తోంది. బాక్సాఫీస్ వద్ద కూడా కాసుల వర్షం కురిపిస్తోంది. ఇక నాని కూడా రోటీన్ కు భిన్నంగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే దసరాతో 100 కోట్ల సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు. హిట్ 3తో కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నారు. దీంతో నాని టైర్ 2 హీరో కాదని, ఆ కంచెను దాటేశారని అభిమానులు చెబుతున్నారు.

వరుస హిట్స్..
ఇక నాని కూడా అగ్రశ్రేణి హీరోలకు ధీటుగానే సినిమాలు తీసుకున్నారు. ఇప్పటికే శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికీ, దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం, హిట్ 3 చిత్రాలతో వరుసగా సక్సెస్ అందుకున్నారు. మరోవైపు దసరా తర్వాత నుంచి అన్నీ పాన్ ఇండియా చిత్రాలే ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. దీంతో నాని రేంజ్ కూడా అమాంతం పెరిగింది. ఈ క్రమంలో నాని తన సినిమాలకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనేది ఆసక్తికరంగా మారింది.
భారీగా రెమ్యునరేషన్..
నాని చివరి రెండు చిత్రాలు హ్యాయ్ నాన్న కు రూ.22 కోట్లు, సరిపోదా శనివారం చిత్రానికి రూ.25 కోట్లు తీసుకున్నట్టు ట్రేడ్ నిపుణులు వెల్లడించారు. ఇక ప్రస్తుతం నాని క్రేజ్ పెరగడంతో తన పారితోషికాన్ని కూడా భారీగానే పెంచేశారు. నెక్ట్స్ రాబోతున్న ప్యారడైజ్ చిత్రానికి ఏకంగా 40 కోట్ల రూపాయల పారితోషికాన్ని తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. దీంతో 15 కోట్లు రెమ్యునరేషన్ పెంచేశారు. అంటే గత పారితోషికంతో పోల్చితే 55 శాతం పెరిగిందని అంటున్నారు.
ప్యారడైజ్ పై హైప్..
దసరా చిత్రంతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో మరోసారి నేచురల్ స్టార్ నాని కలిసి పనిచేస్తున్నారు. రెండోసారి వీరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ప్యారడైజ్. ఈ చిత్రానికి సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ లో రూపుదిద్దుకుంటోంది. కిల్ సినిమా ఫేమ్ బాలీవుడ్ నటుడు రాఘవ్ జూయల్ విలన్ గా నటిస్తున్నారు. తాజాగా ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. మార్చి 26, 2026లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











