twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అంటే సుందరానికీ తప్పలేదు .. ఆమె హ్యాండ్ ఇవ్వడంతో ప్యాకప్ !

    |

    గత ఏడాది వీ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు న్యాచురల్ స్టార్ నాని. ఆ సినిమా ఆశించినంత మేర అంచనాలను అందుకో పోవడంతో ఆయన ఇప్పుడు తన తదుపరి సినిమాల మీద ఫోకస్ ఎక్కువగా పెట్టాడు. ఆయన హీరోగా నటించిన టక్ జగదీష్ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఆ సినిమా వాయిదా వేశారు. ఆ సినిమా సంగతి పక్కన పెడితే నాని మరో రెండు సినిమాలు అనౌన్స్ చేశాడు. అందులో ఒకటి రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ కాగా మరో సినిమా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే సుందరానికీ.

    ప్రియుడిని వదిలేసి.. పెంపుడు కుక్కతో రోడ్డెక్కిన హాట్ బ్యూటీ మలైకా అరోరా

    ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది..భారీగా కరోనా కేసులు నమోదవుతున్నా సరే ఈ సినిమా షూటింగ్ చేయాలని ముందు భావించారు. అందుకు తగ్గట్లుగానే కొద్ది రోజుల క్రితం ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైన మలయాళ నటి నజ్రియా నజీమ్ హైదరాబాద్ చేరుకుంది. ఆమె కాకుండా నదియా కూడా చెన్నై నుండి హైదరాబాద్ వచ్చారు. అయితే తాజాగా ఆ ఇద్దరూ హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లిపోయినట్లు సమాచారం. భారీగా కరోనా కేసులు నమోదు అవుతున్న కారణంగా ఆమె తన షెడ్యూల్ వాయిదా వేయమని దర్శకుడిని కోరి వెళ్లిపోయిందని తెలుస్తోంది.

     Nani’s Ante Sundaraniki Shoot halted as Nazriya Nazim left to chennai

    హీరోయిన్ వెళ్లిపోవడంతో మళ్లీ కాంబినేషన్ సీన్స్ చేయడం కష్టమని భావించి ప్యాకప్చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా నికేత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అలాగే ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. అలాగే ఈ సినిమా నజ్రియా నజీమ్ కు మొదటి డైరెక్ట్ తెలుగు సినిమా. మరో పక్క నాని హీరోగా నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమా షూటింగ్ అయితే జరుగుతున్నట్లు తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితం తన భర్త ఫహాద్ ఫాజిల్ తో కలిసి నజ్రియా హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన పుష్ప షూటింగు నిమిత్తం హైదరాబాదు వచ్చారు.

    English summary
    Nani's Ante Sundarinki with Vivek Athreya has started its shooting recently after female lead Nazriya Nazim joining the sets. Now, the latest update is Nazriya Nazim Faasil and actress Nadhiya came from Chennai and shot for the film for four days. Sources says that With the increasing Covid-19 cases actresses left for Chennai and postponed their schedules.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X