టక్ జగదీశ్.. నాని ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. మామూలుగా ఉండదట!
వరుస ఆఫర్స్‌తో మంచి ఫామ్‌లో ఉన్నారు నాచురల్ స్టార్ నాని. ఓ V మూవీ పనుల్లో బిజీగా ఉంటూనే.. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'టక్ జగదీశ్' షూటింగ్‌లో పాల్గొంటున్నారు. గతంలో నాని- శివ నిర్వాణ కలిసి 'నిన్ను కోరి' సినిమా రూపొందించి సక్సెస్‌ఫుల్ కాంబోగా పేరు తెచ్చుకున్నారు. తిరిగి ఇప్పుడు అదే సక్సెస్ రిపీట్ చేసేందుకు గాను 'టక్ జగదీశ్' సినిమా చేస్తున్నారు.
టైటిల్ ప్రకటనతోనే ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించిన చిత్రయూనిట్.. సినిమా షూటింగ్ కూడా వేగంగా పూర్తిచేస్తోంది. అయితే ఈ సినిమాలో నాని కనిపించబోయే లుక్‌కి సంబంధించి కీలక అప్‌డేట్ తెలిసింది. ఇందులో ఫ్రెంచ్ కట్‌తో, గతంలో ఏ సినిమాలో చూడని విధంగా డిఫరెంట్ స్టైల్‌లో కనిపించనున్నారని సమాచారం. అంతేకాదు ఇప్పటిదాకా ఆయన కెరీర్‌లో చేసిన పాత్రలకి ఈ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుందని అంటున్నారు.

షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నాజర్, రావు రమేశ్, మురళీ శర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 2వ వారం నుంచి ఈ మూవీ తదుపరి షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ కానుంది.


Click it and Unblock the Notifications











