నయా ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన ‘V’ మూవీ.. నాని తప్పుకుంటాడు.. సుధీర్ కొనసాగుతాడు.!

By Manoj

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రయోగాత్మక చిత్రాలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. అయితే, వాటిని గతంలో మాదిరిగా ఈ మధ్య ప్రేక్షకులు ఆదరించడం లేదు. కానీ, మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుత తరం రచయితలు సరికొత్త ప్రయత్నాలతో ముందుకు వస్తున్నారు. ప్రేక్షకుల మైండ్‌సెట్ ప్రకారం టాలీవుడ్‌లో సరికొత్త కథలను పరిచయం చేస్తున్నారు. ఇలాంటి వాటిలో కొన్ని సినిమాలు మాత్రమే ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిపోతున్నాయి. నటీనటులు, దర్శకులతో సంబంధం లేకుండా ఒక్కో జోనర్‌కు ఒక్కో మూవీ ఇలాంటి పేరును సంపాదించుకున్నాయి. తాజాగా నేచురల్ స్టార్ నాని నటిస్తున్న సినిమా కూడా ఓ ట్రెండ్ సెట్ చేయబోతుందని ఓ వార్త ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏంటా న్యూస్.? పూర్తి వివరాల్లోకి వెళితే...

ప్రయోగాలకు వెనుకాడని హీరోలు

ప్రయోగాలకు వెనుకాడని హీరోలు

కొద్ది రోజులుగా టాలీవుడ్‌లోని హీరోలు తమ ఇమేజ్‌ను పక్కన పెట్టి సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ‘ఊపిరి'లో నాగార్జున కాళ్లు లేని వ్యక్తిగా కనిపించాడు. అలాగే, ‘రాజా ది గ్రేట్'లో రవితేజ కళ్లు లేని యువకుడిగా.. ‘జై లవ కుశ'లో ఎన్టీఆర్ నత్తి ఉన్న విలన్‌గా.. ‘రంగస్థలం'లో రామ్ చరణ్ చెవిటి వ్యక్తిగా కనిపించి మెప్పించారు. దీంతో మిగిలిన హీరోలు కూడా వీళ్లను ఫాలో అవుతున్నారు.

వీళ్ల తర్వాత నేచురల్ స్టార్ నానీనే

వీళ్ల తర్వాత నేచురల్ స్టార్ నానీనే

నేచరల్ స్టార్ నాని ఈ మధ్య ‘గ్యాంగ్ లీడర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది ఆశించినంతగా ఆడలేదు. కానీ, ఈ మూవీ రిలీజ్ కాకముందే అతడు ‘V' అనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా ద్వారా నాని సరికొత్త ప్రయోగం చేయబోతున్నాడట. ఇందులో అతడు విలన్‌గా కనిపించబోతున్నాడని అంటున్నారు. అందుకే దీనికి సంకేతంగా ‘V' అనే టైటిల్ పెట్టారట.

వీళ్లిద్దరూ హ్యాట్రిక్ చేయబోతున్నారా.?

వీళ్లిద్దరూ హ్యాట్రిక్ చేయబోతున్నారా.?

నాని నటిస్తున్న ‘V' సినిమాను ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నాడు. అలాగే నివేదా థామస్, అతిథి రావు హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దీనికి ముందు ఇంద్రగంటి - నాని కాంబోలో ‘అష్టాచెమ్మా', ‘జెంటిల్‌మన్' అనే హిట్ సినిమాలు వచ్చాయి. ఇది కూడా హిట్ అయితే హ్యాట్రిక్ అవుతుంది.

నయా ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన ‘V' మూవీ

నయా ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన ‘V' మూవీ

ఈ సినిమాలో నాని విలన్‌గా నటిస్తున్నాడని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమాను ‘ధూమ్' సిరీస్ తరహాలో తెరకెక్కించనున్నారట. ప్రస్తుతం వస్తున్న సినిమా మొదటి భాగం మాత్రమేనని తెలుస్తోంది. ఇందులో హీరో, విలన్‌ పాత్రలకు సమానంగా ప్రాధాన్యత ఉంటుందని ప్రచారం జరుగుతోంది.

నాని తప్పుకుంటాడు.. సుధీర్ కొనసాగుతాడు

నాని తప్పుకుంటాడు.. సుధీర్ కొనసాగుతాడు

‘V' మూవీలో సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్‌గా.. నాని విలన్‌గా కనిపించబోతున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. ‘ధూమ్' సిరీస్ మాదిరిగా రెండో మూవీ నుంచి నాని తప్పుకుంటాడని, అతడి స్థానంలో మరో హీరో వస్తాడని అంటున్నారు. అయితే, పోలీస్‌గా కనిపించనున్న సుధీర్ బాబు మాత్రం అభిషేక్ బచ్చన్‌లా ఈ సిరీస్‌లోని అన్ని మూవీల్లో ఉంటాడనే టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X