నాని V కథ లీక్! అసలు కథ ఇదేనా..?
నాచురల్ స్టార్ నాని హీరోగా మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా V. ఈ టైటిల్ ఆసక్తికరంగా ఉండటంతో ఒక్కసారిగా ప్రేక్షకులందరి చూపు ఈ సినిమాప పడింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిత్రంలో నాని, సుధీర్‌బాబు హీరోలుగా నటిస్తుండగా, నివేదా థామస్, అదితిరావు హైదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
కాగా తాజాగా ఈ సినిమా స్టోరీ ఇదే అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి. యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ ఇటీవలే విడుదల చేసింది చిత్రయూనిట్. దీనిపై ఎట్ దిల్ అవర్ లై ఎట్ మై మెర్సీ ఆల్ మై ఎనీమీస్' అనే ట్యాగ్ లైన్ జత చేసింది. దీంతో ఈ ట్యాగ్ లైన్ లోనే కథ మొత్తం దాగి ఉందంటూ కథ అంతా చెప్పేస్తున్నారు కొందరు.

'ఈ గంటలో నా శత్రువులందరు నా దయ వల్ల ప్రశాంతంగా వున్నారు' అనేది ఈ ట్యాగ్ లైన్ అర్థం. ఈ ట్యాగ్ లైన్ సినిమా ఏ నేపథ్యంలో సాగుతుందో చెప్పేస్తోంది. ఇద్దరు అన్నదమ్ముల మధ్య సాగే వార్‌గా ఈ సినిమా స్క్రిప్ట్ ఉండి ఉంటుందని అంచనా వేస్తున్నారు. నాని- సుధీర్ బాబు బ్రదర్స్ గా కనిపించబోతున్నట్లు, నాని సైకో కిల్లర్‌గా నటిస్తున్నాడని అంటున్నారు.
నానిని ఆపే బ్రదర్‌గా సుధీర్ బాబు నటన ఆకట్టుకోనుందని సమాచారం. మొత్తానికైతే విలన్ సెంట్రిక్ సినిమాగా ఉంటుందని అంటున్నారు. ఈ చిత్రంలో నాని మొదటిసారి విలన్‌గా కనిపించబోతున్నారు. ఉగాది కానుకగా మార్చి 25 వ తేదీన V ప్రేక్షకులను అలరించనుంది.


Click it and Unblock the Notifications











