హీరో నాని భార్య కూడా సినిమాల్లోకి..!

ఆ విషయం పక్కన పెడితే...2012లో నాని తన గర్ల్‌ఫ్రెండ్ అంజనాను పెళ్లాడిన సంగతి తెలిసిందే. తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న ఆసక్తికర సమాచారం ఏమిటంటే....అంజనా కూడా ఇపుడు సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. అయితే తెరపై మాత్రం కాదులెండి. తెర వెనక విభాగంలో ఆమె తన టాలెంటు చూపించేందుకు ఉత్సాహం చూపిస్తుందట.
బాహుబలి సినిమా నిర్మిస్తున్న ఆర్కా మీడియా సంస్థలో ఆమె కాస్టూమ్ డిజైనింగ్ డిపార్టుమెంటులో పని చేస్తున్నట్లు సమాచారం. రాజమౌళి భార్య రమారాజమౌళితో కలిసి ఆమె పని చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి భార్య రమ, శ్రీను వైట్ల భార్య రూప మాదిరి....ఈ రంగంలో అడుగు పెడుతున్న అంజనా తన టాలెంటు ఏ మేరకు చూపెడుతుందో చూడాలి.
నాని-అంజనా గురించిన వివరాల్లోకి వెళితే....పెళ్లికి ముందు నుంచే వీరు ప్రేమలో ఉన్నారు. ఆగస్ట్ 12, 2012లో వీరి నిశ్చితార్థం జరిగింది. వైజాగ్ రిషికొండ రిసార్ట్ లో అక్టోబర్ 27,2012న వివాహం జరిగింది.


Click it and Unblock the Notifications











