నాని - యష్ రాజ్ ఫిల్మ్స్ చిత్రం టైటిల్

ఈ రీమేక్ లో నటించడానికి యష్ రాజ్ ఫిల్మ్స్ రూ. 2.5 కోట్లు ఆఫర్ చేసిందనే వార్త ఆ మధ్యన టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరియర్ ప్రారంభించి, అతి తక్కువ కాలంలో టాలీవుడ్ లో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్న నాని, ఈగ సినిమా సూపర్ హిట్ అవడంతో అటు కోలీవుడ్ లోనూ ఇటు టాలీవుడ్ లోను కూడా నానికి మంచి ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం "జండా పై కపిరాజు", "పైసా" సినిమాలలో నటిస్తున్నాడు.
ఇక ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న నలుగురు యువకుల కథతో దర్శకుడు సిరాజ్‌కల్లా తెరకెక్కించిన చిత్రం డీ ఫర్ దోపిడి. వరుణ్‌సందేశ్, సందీప్‌కిషన్ ప్రధానపాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈనెల 25న విడుదల కానుంది. ఆద్యంతం నవ్వులు పంచుతూ సాగే ఈ దోపిడీ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేసింది. ఈ చిత్రానికి నాని సహ నిర్మాతగా వ్యవహరించడం, దిల్‌రాజు ఈ చిత్రాన్ని పంపణీ చేస్తుండటం విశేషం.


Click it and Unblock the Notifications











