బన్నీ ప్లేస్ లోకి నాని.. ఇలా జరగడం సెకండ్ టైం!

Recommended Video

Nani Said Ok Allu Arjun Story

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య చిత్రం తరువాత నటించే సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొని ఉంది. నా పేరు సూర్య చిత్రం విడుదలై చాలా రోజులు గడుస్తున్నా ఇంతవరకు బన్నీ కొత్త చిత్రం ప్రారంభించలేదు. అందుకు కారణం అభిమానులకు ఓ మంచి చిత్రాన్ని అందించాలనే ఉద్దేశమే. విక్రమ్ కుమార్ ఉత్కంఠ భరితమైన కథ సిద్ధం చేశాడు. ఆ కథ అల్లు అర్జున్ కు కూడా నచ్చింది. కానీ ఏమూలనో బన్నీకి డౌట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో విక్రమ్ కుమార్ ప్రతిపాదనని బన్నీ పక్కకు పెట్టేసినట్లు తెలుస్తోంది. ఇదే కథతో విక్రమ్ కుమార్ వేరే హీరోతో చిత్రం రూపొందించడానికి రెడీ అయిపోయాడనేది లేటెస్ట్ టాక్.

నాని పాకెట్‌లోకి బన్నీ స్టోరీ

నాని పాకెట్‌లోకి బన్నీ స్టోరీ

విక్రమ్ కుమార్ చేసిన మార్పులు కూడా బన్నీకి సంతృప్తినివ్వలేదు. దీనితో త్వరలో ప్రారంభం అవుతుందని అనుకుంటూ వచ్చిన ప్రాజెక్ట్ ఆలస్యం అవుతూ వచ్చింది. తాజాగా అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో నటించేందుకు సిద్ధం అవుతుండడంతో విక్రమ్ కుమార్ కథ నాని వద్దకు వెళ్లిందట.

నాని బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లుగా

నాని బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లుగా

విక్రమ్ కుమార్ వినిపించిన కథ నానిని విపరీతంగా ఆకర్షించినట్లు తెలుస్తోంది. పైగా విక్రమ్ కుమార్ ప్రతిభావంతుడైన దర్శకుడు. దీనితో నాని వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. అల్లు అర్జున్ కి తగ్గట్లుగా సిద్ధం చేసుకున్న కథని నాని బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా మార్చే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.

రెండవసారి

రెండవసారి


అల్లు అర్జున్ కోసం సిద్దమైన కథ నాని పాకెట్ లోకి చేరడం ఇది రెండవ సారి. మారుతి దర్శత్వంలో వచ్చిన భలే భలే మగాడివోయ్ కథ కూడా అల్లు అర్జున్ కోసం సిద్ధం చేసుకున్నదనే ఊహాగానాలు ఉన్నాయి.

బిజీగా నేచురల్ స్టార్

బిజీగా నేచురల్ స్టార్

నాని ఇపుడేం ఖాళీగాలేదు. జెర్సీ చిత్రంలో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు. మరి కొందరి దర్శకులతో కూడా కమిట్ మెంట్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో విక్రమ్ కుమార్ దర్శత్వంలో చిత్రం ఎప్పుడు.. ఎవరి నిర్మాణంలో ప్రారంభమవుతుందో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X