నాని ‘పారడైజ్’.. విలన్ గా భయంకరమైన నటుడు.. ఎవరో తెలుసా?
నేచురల్ స్టార్ నాని వరుస హిట్లను అందుకుంటూ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. సక్సెస్ జోరులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ప్రకటిస్తూ వస్తున్నారు. ఇప్పటికే నానికి చివరిగా 'సరిపోదా శనివారం' చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్ అందింది. మరోవైపు ఆయన ప్రొడ్యూస్ చేసిన 'కోర్టు' చిత్రంతోనూ మంచి సక్సెస్ ను అందుకున్నారు. ప్రస్తుతం క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ హిట్ 3 (HIT : The Third Case)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తూ సినిమాపై హైప్ పెంచిన సంగతి తెలిసిందే.
మే1న హిట్ 3తో నాని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సిరీస్ పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలతో పాటు వరల్డ్ వైడ్ గానూ విడుదలకు సిద్ధంగా ఉంది. శైలేష్ కొలను దర్శకత్వంలో నటించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నానినే నిర్మించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే రూ.70 వరకు ప్రీ రిలీజ్ ద్వారా లాభాలను గడించింది. ఇక సినిమా ఫలితాలు ఎలా ఉంటాయనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇదిలా ఉంటే.. నాని లైనప్ లో మరో మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ కూడా ఉంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని రెండోసారి నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. ఏకంగా రూ.120 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. దాంతో మళ్లీ ఈ కాంబినేషన్ ను నాని రిపీట్ చేశారు. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో 'పారడైజ్' అనే చిత్రం రూపు దిద్దుకుంటోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి అందింది.
నాని హిట్3 చిత్రం రేపు విడుదల కాబోతున్న సందర్భంలో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న 'పారడైజ్' గురించి గూస్ బంప్స్ తెప్పించే న్యూస్ అందింది. ఈ చిత్రంలో విలన్ గా నటించేందుకు బాలీవుడ్ ప్రముఖ నటుడు రాఘవ్ జుయల్ ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. ఈయన రీసెంట్ గా హిందీలో వచ్చిన 'కిల్' సినిమాలో విలన్ గా నటించి అదరగొట్టాడు. ట్రైయిన్ లో ఉండే యాక్షన్ సీక్వెన్స్ లో ఈయన పెర్ఫామెన్స్ అందరినీ ఆకట్టుకుంది. అలాగే తన నటనకు నార్త్ ఆడియెన్స్ ఎంతగానో ఫిదా అయ్యారు.
రాఘవ్ జుయల్ ఒక డ్యాన్సర్. హిందీ టెలివిజన్ లో ప్రసారమైన 'డ్యాన్స్ ఇండియా డ్యాన్స్' సీజన్ల3లో కంటెస్టెంట్ గా తన ప్రయాణాన్ని కొనసాగించారు. ప్రస్తుతం డ్యాన్స్ షోలకు జడ్జీగా, హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. మరోవైపు వెండితెరపై కేవలం నెగెటివ్ పాత్రలు పోషిస్తూ దుమ్ములేపుతున్నాయి. మరోవైపు విలన్స్ ను పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేస్తున్న శ్రీకాంత్ ఓదెల ఈయన్ని ఎలా చూపిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పారడైజ్ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సోనాలి కులకర్ణి హీరోయిన్ గా నటిస్తోంది. అనిరుధ్ రవిచంద్ర సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











