twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాని ‘పైసా’ పై గుసగుసలు

    By Srikanya
    |

    హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ ప్రస్తుతం నాని హీరోగా 'పైసా' చిత్రం రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కేథరిన్, సిద్ధిక శర్మ హీరోయిన్లుగా చేస్తున్నారు. ఈచిత్రం ఆడియో విడుదల విడుదలై చాలా రోజులైనా విడుదల తేదీ సంగతి తేలటం లేదు. అలాగే ఎక్కడా పబ్లిసిటీ క్యాంపైన్ కూడా చేయటం లేదు. బిజినెస్ పూర్తి కాకపోవటంతో రిలీజ్ డేట్ పెండింగ్ లో పెట్టినట్లు చెప్పుకుంటున్నారు.

    సినిమాకు కృష్ణవంశీ బాగా ఎక్కువ ఖర్చు పెట్టాడని, అది నాని మార్కెట్ ని దాటి పోయిందని, అలాగే కృష్ణవంశీ కి ప్రత్యేకమైన మార్కెట్ వరస ఫ్లాపులతో ఇప్పుడు లేకపోవటం కూడా ఇబ్బంది ఎదురువు అవుతోందని అంటున్నారు. ఎక్కువ రేట్స్ చెప్పటంతో కొనుక్కునేవాళ్లు వెనక అడుగు వేస్తున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినపడుతున్నాయి.

    ఈ చిత్రంలో నాని పేరు... ప్ర'క్యాష్'(Pra'cash'). డబ్బు కంటే అతనికి ఏదీ ఎక్కువ కాదు. ఈచిత్రంలో నాని యంగ్ పొలిటీషియన్‌గా కనిపించబోతున్నాడు. దర్శకుడు కృష్ణ వంశీ మార్కుకు ఏమాత్రం తగ్గకుండా ఈచిత్రం ఉండబోతోంది. అన్ని కోణాల్లో తనదైన ముద్దవేస్తూ ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

    నిర్మాతలు కూడా ఆయన క్రియేటివిటీకి తగిన విధంగా భారీగా ఖర్చు పెడుతున్నారు. కేవలం పాటల చిత్రీకరణ కోసం దాదాపు కోటికిపైగా వెచ్చించినట్లు తెలుస్తోంది. అదే విధంగా కాస్టూమ్స్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. నాని కాస్ట్యూమ్స్ కోసం స్వారోవ్‌స్కి క్రిస్టల్స్ వాడారు. ఓక్కో సూట్ కోసం దాదాపు 20 వేల క్రిస్టల్స్ వాడారు. వీటితో తయారు చేసే ఒక్కో సూట్ కు రూ. 7.5 లక్షల వరకు ఖర్చవుతోందని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఇండియాలో ఏ హీరో కూడా ఇలాంటి సూట్ తో పెర్ఫార్మ్ చేయలేదట. ఇంతకీ వీటికున్న ప్రత్యేకత ఏమిటంటే.... మైఖేల్ జాక్సన్ ఇలాంటి క్రిస్టల్స్ తో చేసిన కాస్ట్యూమ్స్ వాడేవారని యూనిట్ సభ్యులు అంటున్నారు.

    ఎల్లోఫ్లవర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గతంలో మిరపకాయ నిర్మించిన రమేష్‌ పుప్పాల నిర్మాత. ఇక గోపీచంద్ మొగుడు తర్వాత కృష్ణవంశీ చేస్తున్న చిత్రం ఇదే. ఆ చిత్రం డిజాస్టర్ కావటంతో కొంత గ్యాప్ తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

    English summary
    Paisa seems to be taking its own time to come to the theatres. Directed by Krishna Vamsi, this film stars Nani and Catherine Tressa in the lead. Krishna Vamsi was hoping to bounce back with this film. No promotion or publicity activity is being done for the film. Once in a way actor Nani is tweeting about the film. But no one is coming forth on the release date.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X