నాని సరసన త్రిప్తి డిమ్రీ.. స్టన్నింగ్ రోల్‌లో మాధురి దీక్షిత్?
బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు, లైనప్‌తో దూసుకెళ్తున్నారు నేచురల్ స్టార్ నాని. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ సినిమాలో నటిస్తున్నారు నేచురల్ స్టార్. అండర్ వరల్డ్ బ్యాక్‌డ్రాప్‌లో, హై ఓల్డేజ్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఆగస్ట్ 21న ది ప్యారడైజ్ మూవీ పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషలల రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత కూడా క్రేజీ కాంబినేషన్స్ సిద్ధం చేస్తున్నారు నాని.
మాస్ హీరో ఇమేజ్ కోసం తీవ్రంగా ట్రై చేస్తున్నారు నాని. తొలుత లవర్ బాయ్‌గా, ఫ్యామిలీ హీరోగా క్లాస్ మూవీస్ చేస్తూ వచ్చిన నాని.. ఫుల్ లెంగ్త్ మాస్ క్యారెక్టర్స్‌ని వెతికిమరి పట్టుకుంటున్నారు. దసరాతో ఈ ప్రయత్నంలో కొంతమేరకు సక్సెస్ అయ్యాడు. ఆ వెంటనే శైలష్ కొలను హిట్ ఫ్రాంచైజీ అయిన హిట్ 3లో అర్జున్ సర్కార్‌గా రక్తపాతాన్ని సృష్టించాడు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెలతో చేస్తోన్న ది ప్యారడైజ్‌తో మాస్ యాక్షన్ హీరోగా టర్న్ అవ్వాలని ట్రై చేస్తున్నాడు. జుట్టు బాగా పెంచి జడలు ముందు వేసుకుని డిఫరెంట్ లుక్‌లో ఉన్న నాని అంచనాలను పెంచేస్తున్నాడు.

అయితే ఈ ప్రాసెస్‌లో ఆయన తనకు ఇంతకాలం వెన్నుదన్నుగా నిలిచిన ఫ్యామిలీ ఆడియన్స్‌ను కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. ఆల్రెడీ ది ప్యారడైజ్ నుంచి రిలీజైన గ్లింప్స్‌లో వచ్చిన బూతు పదాలు ఇబ్బందికరంగా ఉన్నాయని తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ నడిచింది. హిట్ 3 సమయంలో క్లాస్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలు రావొద్దని స్వయంగా నానినే డిస్‌క్లెయిమర్ వేశాడు. ఇప్పుడు ది ప్యారడైజ్ చూస్తుంటే అంతకుమించి అనేలా ఉంది. అయినప్పటికీ రిస్క్ చేసి మాస్ హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నారు నాని.
ది ప్యారడైజ్ రిజల్ట్ ఎలా ఉన్నా మాస్ యాక్షన్ సినిమాలనే డిసైడ్ అయ్యారు నాని. దీనిలో భాగంగా ఓజీతో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు పవర్‌ఫుల్ హిట్ ఇచ్చిన సుజీత్ దర్శకత్వంలో నాని తన తదుపరి సినిమాను చేయనున్నారు. గతేడాది విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని నాని - సుజిత్ మూవీ పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ సినిమాను నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్, అనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై వెంకట్ బోయినపల్లి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నాని కెరీర్‌లో ఇది 34వ సినిమా. యాక్షన్, ఎమోషన్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే సుజిత్ సినిమాటిక్ యునివర్స్‌లో ఈ సినిమా భాగమా? లేదా? అనేది మాత్రం తెలియరాలేదు. నానిని ఇప్పటి వరకు ఎవరూ చూపని విధంగా స్టైలీష్‌గా చూపించేందుకు సుజిత్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిలింనగర్ టాక్.
ఇదిలాఉండగా.. ఈ నాని మూవీకి క్యాస్టింగ్ విషయంలోనూ సుజిత్ ఆచితూచి ఎంపికలు చేస్తున్నాడట. ముఖ్యంగా హీరోయిన్‌కు సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నాని సరసన యానిమల్, స్పిరిట్ ఫేమ్ త్రిప్తి దిమ్రిని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు.. ఈ సినిమాలో మరో కీలకమైన పాత్ర కోసం అలనాటి నటి, 90వ దశకంలో భారతీయ తెరపై డ్రీమ్ గర్ల్‌గా వెలుగొందిన మాధురి దీక్షిత్‌ను సుజిత్ సంప్రదించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అది నాని తల్లి పాత్ర కోసమైనా లేదంటే మరేదైనా కీలకపాత్ర కోసమైనా కావొచ్చనే టాక్ వినిపిస్తోంది. అయితే 40 ఏళ్ల కెరీర్‌లో ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాలోనూ మాధురి నటించలేదు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆమె తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైతే మాత్రం అది హాట్ టాపిక్కే. పాన్ ఇండియా లెక్కలు, హిందీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సుజిత్.. త్రిప్తి దిమ్రి, మాధురిలను రంగంలోకి దించినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఇంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











