నాని ప్లానింగ్ ఫెయిలైందా? ది ప్యారడైజ్ కు మరోసారి బ్రేక్ పడిందా?

టాలీవుడ్‌లో పక్కా ప్లానింగ్ తో పనిచేసే హీరోల్లో నేచురల్ స్టార్ నాని పేరు ముందు వరుసలో ఉంటుంది. సినిమా ఎంపిక నుంచి షూటింగ్ షెడ్యూల్ వరకు ప్రతి విషయంలో పక్కా ప్లానింగ్‌తో ముందుకు సాగుతారు. అలాగే.. నిర్మాతలకు కూడా నమ్మకమైన హీరోగా పేరు తెచ్చుకున్నారు నాని. అందుకే ఆయన సినిమాలు సాధారణంగా ప్రకటించిన సమయానికే పూర్తి కావడం, రిలీజ్ కావడం చూస్తుంటాం. అయితే ఇప్పుడు ఆయన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'ది ప్యారడైజ్' విషయంలో మాత్రం లెక్కలు మారిపోయినట్లు కనిపిస్తోంది.

దసరా వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నాని కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా 'ది ప్యారడైజ్'.ఈ చిత్రంలో నాని పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించనున్నారు. రెండు జడల హెయిర్ స్టైల్, రఫ్ బాడీ లాంగ్వేజ్‌తో ఇప్పటివరకు చూడని పాత్రలో ప్రేక్షకులను అలరించబోతున్నారు. హీరోయిన్‌గా మమత బైజు నటిస్తుండగా, సీనియర్ నటుడు మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. సంపూర్ణేష్ బాబు కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Nani The Paradise Likely Delayed Again Latest Release Date Update and Buzz

ఇలా భారీ కాస్టింగ్ ఉండటంతో ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా నాని కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్లు, 'ఆయా షేర్' సాంగ్ సినిమాపై విపరీతమైన హైప్‌ను క్రియేట్ చేశాయి. వాస్తవానికి ఈ సినిమా మొదట 2026 మార్చి 26న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ షూటింగ్ పనులు అనుకున్న వేగంతో సాగకపోవడంతో ఆ తేదీని వదులుకోవాల్సి వచ్చింది. అనంతరం ఆగస్టు 21న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. దీంతో అభిమానులు కొత్త రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తుండగా, ఇప్పుడు మరోసారి వాయిదా వార్తలు తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది.

టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, 'ది ప్యారడైజ్' ఇంకా షూటింగ్ దశలోనే ఉందని తెలుస్తోంది. ఇప్పటికే 100 రోజులకు పైగా చిత్రీకరణ పూర్తయినా, కీలక సన్నివేశాల చిత్రీకరణ ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. అంతేకాదు, భారీ స్థాయిలో రూపొందిస్తున్న యాక్షన్ సీక్వెన్స్‌లు, విజువల్ ఎఫెక్ట్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరింత సమయం అవసరమవుతోందని తెలుస్తోంది. క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి భావిస్తున్నారట.

ఇదే సమయంలో ఆగస్టు 21 తేదీకి మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న 'ఇరుముడి' సినిమాను అధికారికంగా ప్రకటించడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఒకే తేదీకి రెండు భారీ సినిమాలు రావడం బాక్సాఫీస్ పరంగా రిస్క్ కావడంతో, 'ది ప్యారడైజ్' ఆ రేసు నుంచి తప్పుకున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయినా.. సోషల్ మీడయాలో భారీ మొత్తంలో వాయిదా ప్రచారం సాగుతోంది.

ఇక నాని కెరీర్‌లో ఇలాంటి పరిస్థితి చాలా అరుదుగా కనిపిస్తుంది. సాధారణంగా షూటింగ్ ప్రారంభించే ముందే పూర్తి ప్రణాళికతో వెళ్లే నాని, ఈసారి మాత్రం భారీ స్కేల్ కారణంగా కొంత వెనుకబడినట్లు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. 'ది ప్యారడైజ్' సాధారణ కమర్షియల్ సినిమా కాకుండా, పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ప్రాజెక్ట్ కావడం కూడా ఆలస్యానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం, ఆగస్టు రిలీజ్ సాధ్యం కాకపోతే దసరా సీజన్ లేదా డిసెంబర్ హాలిడే సీజన్‌ను టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 'దసరా' సినిమాతో నానికి భారీ విజయం అందించిన పండుగ సీజన్‌ను మళ్లీ ఉపయోగించుకోవాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట.

ఇలా 'ది ప్యారడైజ్' వాయిదా వార్తలు నాని అభిమానులను నిరాశకు గురిచేస్తున్నప్పటికీ, మరోవైపు సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. ఎందుకంటే మేకర్స్ తొందరపడకుండా, పూర్తి నాణ్యతతో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నారని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో, కొత్త రిలీజ్ డేట్ ఏమిటో తెలుసుకోవాలంటే మూవీ మేకర్స్ నుంచి వచ్చే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.

Read more about: nani srikanth odela The Paradise
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X