twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Tuck jagadeesh leak: ఆ యాప్ లో ఫుల్ మూవీ.. ఇలా అయితే ఓటీటీ కంపెనీలు మూసుకోవాల్సిందే!

    |

    కొత్త సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే ఒకప్పుడు థియేటర్స్ మొత్తం ఎంతో సందడిగా కనిపించేవి. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు వచ్చే ఒక రోజు ముందే ప్రీమియర్ షోలు అంటూ అభిమానులు చేసే సందడి అంతా ఇంతా కాదు. అయితే మారుతున్న కాలంలో పెరుగుతున్న టెక్నాలజీ వలన సినిమాల వాతావరణం కూడా చాలా చేంజ్ అవుతొంది. ఓటీటీ కంపెనీల రాకతో ఒక్కసారిగా సినిమాలు చూసే విధానం కూడా మారిపోయింది. అయితే అక్కడ కూడా పైరసీ ఎఫెప్ట్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. ఆ రూట్లో ఇంకా పైరసీ డోస్ పెరిగిందని చెప్పాలి. టక్ జగదీష్ కూడా విడుదలైన కొన్ని నిమిషాలకి ఒక యాప్ లో ఒక్క క్లిక్కుతో డౌన్లోడ్ అవ్వడం విశేషం..

    ఎమోషనల్ డ్రామాగా..

    ఎమోషనల్ డ్రామాగా..

    శివ నిర్వణ - నాని కాంబినేషన్ లో ఇదివరకే నిన్ను కోరి అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలను అందించింది. మళ్లీ ఆ తర్వాత మరో సినిమా చేయాలని శివ నిర్వణ, నానితో నిత్యం చర్చలు జరుపుతూనే ఉన్నాడు. ఇక ఫైనల్ గా టక్ జగదీష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకున్నారు. ఈ సినిమాలో మొదట థియేటర్స్ లో విడుదల చేయాలని అనుకున్నప్పటికీ వర్కౌట్ కాలేదు.

    థియేటర్స్ లో రవాల్సిన సినిమా

    థియేటర్స్ లో రవాల్సిన సినిమా

    ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన టక్ జగదీష్ సినిమాపై మొదటి నుంచి కూడా అభిమానులలో పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే నెలకొన్నాయి. థియేటర్స్ కు భారీగా ఓపెనింగ్స్ అందుకునే ఛాన్స్ కూడా ఉందని అందరూ అనుకున్నారు. అయితే ఊహించని విధంగా సినిమా ఓటీటీలో రావడం అందరినీ షాక్ కు గురి చేసింది. ఒక విధంగా ఎగ్జిబీటర్లు కొంత అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ మొత్తానికి ఓటీటీ లోనే సినిమా విడుదలయ్యింది.

     ఓటీటీపై కూడా పైరసీ దెబ్బ

    ఓటీటీపై కూడా పైరసీ దెబ్బ

    అసలు మ్యటర్ లోకి వస్తే పైరసీ దెబ్బకు గత కొన్ని ఏళ్లుగా సినిమా పరిశ్రమ ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంది. ఎంతమంది అగ్ర హీరోలు నిర్మాతలు దర్శకులు పైరసీని అరికట్టాలని ఎంతో ప్రయత్నం చేశారు. కానీ ఏమాత్రం వర్కవుట్ అవ్వడంలేదు. ఇక ఓటీటీ ప్రపంచంలో భారీ టెక్నీకల్ సెక్యూరిటీతో విడుదల చేసినప్పటికీ మరుక్షణంలోనే HD ప్రింట్స్ లలో ఫుల్ మూవీ లీక్ అవుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

    ఆ యాప్ లో లీక్..

    ఆ యాప్ లో లీక్..

    టక్ జగదీష్ కూడా విడుదలైన కొంతసేపటికి టెలిగ్రామ్ లో దర్శనమిచ్చింది. తమిళ్ రాకర్స్ వంటి పైరసీ వెబ్ సైట్లు మొన్నటి వరకు బాగానే హల్చల్ చేశాయి. కానీ ఇప్పుడు వాటన్నిటికీ కేంద్రబిందువుగా టెలిగ్రామ్ యాప్ మారుతోంది. ఒక లింకు తోనే సినిమా మొత్తం డౌన్ లోడ్ అవుతోంది అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గురువారం అమెజాన్ ప్రైమ్ విడుదలైన టాప్ చౌదరి సినిమా కొద్దిసేపటికి టెలిగ్రామ్ యాప్ లో దర్శనం ఇచ్చింది. సెర్చ్ లో ఫుల్ మూవీ అని కొడితే చాలు హై క్లారిటీ సినిమా లింకులు వస్తున్నాయి.

    Recommended Video

    Daare Leda Team interview part 3. Real life doctor roopa Shares her life experiences In covid times
    ఇలానే కొనసాగితే..

    ఇలానే కొనసాగితే..

    అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ కంపెనీ మంచి సెక్యూరిటీతో కొనసాగుతున్నాయి. అయినప్పటికి పైరసీ ఏ మాత్రం తగ్గకుండా hd ప్రింట్స్ లీక్ అవుతున్నాయి. గతంలో చాలా సినిమాలు కూడా ఇదే తరహాలో విడుదలైన కొన్ని గంటలకే టెలిగ్రామ్ యాప్ లో దర్శనమిచ్చాయి. సినిమా వర్గాలు ఈ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా చట్టపరంగా ఏమి చేయలేక పోతున్నారు. కొన్నాళ్ళు ఇలానే కొనసాగితే ఓటీటీ కంపెనీల బిజినెస్ భారీగా తగ్గిపోతుంది. ఎలాగూ టెలిగ్రామ్ యాప్ లో నే సినిమా వస్తుంది కాబట్టి నెటిజన్లు ఓటీటీ ఎకౌంట్స్ వైపు పెద్దగా ఇంట్రెస్ట్ చూపే అవకాశం ఉండదు. చిన్న కంపెనీలు అయితే మెల్లగా మూతపడిన కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి భవిష్యత్తులో ఈ విధమైన పైరసీపై ఏదైనా నిర్ణయం తీసుకుంటారో లేదో చూడాలి.

    English summary
    Nani Tuck jagadeesh full movie leak in telegram app,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X