ఓటీటీలోనే నాని V మూవీ.. భారీ ధరకు డీల్ సెట్ చేసుకున్న దిల్ రాజు?
ప్రస్తుతం విడుదల కావాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయి. కరోనా లాక్ డౌన్ దెబ్బకు విడుదలకు నోచుకోలేని సినిమాలు థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. కానీ పరిస్థితులు ఇప్పట్లో అదుపులోకి వచ్చేలా లేవని చాలా మందికి క్లారిటీ వచ్చేసింది. అందుకే ఓటీటీలో డైరెక్ట్ గా రిలీజ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ నాని 25వ సినిమా Vకూడా ఓటీటీ కంపెనీతో భారీ డీల్ సెట్ చేసుకున్నట్లు ఫిల్మ్ నగర్ లో ఒక టాక్ వినిపిస్తోంది.

సమ్మర్ లోనే రిలీజ్ కావాల్సింది
నాని, నివేద థామస్, సుధీర్ బాబు, అదితి రావ్ హైదరి వంటి స్టార్స్ నటించిన V మూవీ సమ్మర్ లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. అయితే ఏప్రిల్ లో రిలీజ్ చేయాలని నిర్మాత దిల్ రాజు ఆల్ మోస్ట్ అన్ని ఏరియాలకు సంబంధించిన డీల్స్ ని కూడా క్లోజ్ చేశాడు.

ఇన్ని రోజులు వెయిట్ చేసింది అందుకే..
కానీ ఊహించని విధంగా కరోనా వైరస్ విజృంభనతో లాక్ డౌన్ విధించడం వలన సినిమా థియేటర్లు మూత పడ్డాయి. 25కోట్లకు పైగా ఖర్చు చేసి సినిమాను నిర్మించారు. మినిమమ్ ప్రాఫిట్స్ లేకపోతే అంత పెట్టుబడులు పెట్టి వృధా అవుతుంది. అందుకే ఇన్ని రోజులు ఓటీటీ నుంచి ఎన్ని ఆఫర్స్ వచ్చినా కూడా దిల్ రాజు ఒప్పుకోలేదని టాక్.

అమెజాన్ లో ఎప్పుడంటే..
ఇక ఫైనల్ గా అమెజామ్ ప్రైమ్ రంగంలోకి దిగి V సినిమాను డైరెక్ట్ గా రిలీజ్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతోంది. ఇక సెప్టెంబర్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం ఉందట. ముందు ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గట్టిగానే ప్రయత్నాలు చేశారని టాక్ వచ్చింది. ఆహా యాప్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయాలని దిల్ రాజుతో చర్చలు జరిపినప్పటికి వర్కౌట్ కాలేదట.
Recommended Video

భారీ డీల్ సెట్ చేసుకున్న నిర్మాత
ఇక అమెజాన్ ప్రైమ్ రూ.33.22కోట్లతో ఓటీటీ డైరెక్ట్ రిలీజ్ డీల్ ని క్లోజ్ చేసినట్లు టాక్ వస్తోంది. ఈ డీల్ పై మొదట కాస్త వెనుకడుగు వేసినప్పటికి దిల్ రాజుకు మరో దారి కనిపించలేదట. ఎందుకంటే ఇప్పట్లో థియేటర్స్ ఓపెన్ కావు. అయినా కూడా జనాలు వస్తారనే గ్యారెంటీ లేదని ఈ ఆలోచనకు వచ్చినట్లు రూమర్స్ వస్తున్నాయి. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











