ఇంట్రెస్టింగ్: V అంటే విలన్ కాదు.. నాని సినిమా టైటిల్ వెనుక రహస్యం లీకైపోయింది.!
తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా కాలంగా ప్రయోగాత్మక చిత్రాలు ప్రభావం చూపిస్తున్నాయి. తక్కువ బడ్జెట్‌తో వచ్చి ఎక్కువ వసూళ్లను రాబట్టిన చిత్రాల్లో అలాంటివే ఎక్కువగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ మూవీలు మంచి విజయాలను అందుకుంటున్నాయి. అందుకే టాలీవుడ్‌లోని చాలా మంది హీరోలు, దర్శకులు ఆ తరహా చిత్రాలు చేయడానికే మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేచురల్ స్టార్ నాని కూడా సరికొత్త ప్రయోగంతో ముందుకు వస్తున్నాడు. తాజాగా ఆ సినిమాకు సంబంధించిన ఓ సీక్రెట్ రివీల్ అయిపోయింది. వివరాల్లోకి వెళితే...

క్లిష్ట సమయంలో కలిశాడు.. హ్యాట్రిక్ చేస్తారా.?
‘జెర్సీ' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు నాని. అయితే, ఆ తర్వాత వచ్చిన ‘గ్యాంగ్ లీడర్' మాత్రం బాక్సాఫీస్ ముందు బోల్తా పడింది. ఈ నేపథ్యంలో తనకు రెండు సూపర్ హిట్లు (అష్టాచమ్మా, జెంటిల్‌మెన్) ఇచ్చిన ఇంద్రగంటి మోహనకృష్ణతో కలిశాడు. తప్పక హిట్ కొట్టాల్సిన సమయంలో నాని - ఇంద్రగంటి ఎలాంటి సినిమాను అందిస్తారోనని అందరూ అనుకుంటున్నారు.

ప్రయోగాత్మకంగా.. అందుకే ఇలా పెట్టారు
ఇంద్రగంటి మోహనకృష్ణ - నాని కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం ‘V'. బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో సుధీర్ బాబు, నివేదా థామస్, అతిథి రావు హైదరి సహా ఎంతో మంది ప్రముఖులు నటిస్తున్నారు. ఈ సినిమా క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అందుకే దీనికి సరికొత్తగా ‘V' అనే టైటిల్ పెట్టారని ప్రచారం జరుగుతోంది.

సైకో కిల్లర్.. హాలీవుడ్ రేంజ్‌లో చూపించారు
ఈ సినిమాలో నాని సైకో కిల్లర్‌గా కనిపించబోతున్నాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. దానికి అనుగుణంగానే ఇటీవల విడుదలైన టీజర్‌లో అతడిని చూపించారు. ఇందులో నాని చెప్పిన డైలాగులు కూడా పేలిపోయాయి. అంతేకాదు, సుధీర్ బాబు కూడా స్టైలిష్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించాడు. మొత్తానికి ఈ టీజర్ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది.

‘V’ టైటిల్ వెనుక రహస్యం లీకైపోయింది.!
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా టైటిల్ గురించి తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం... అందరూ అనుకుంటున్నట్లు ‘V' అంటే విలన్ కాదట. ఇందులో నాని హత్య చేసిన ప్రతిసారి అక్కడ ఓ గుర్తును వదిలేసి వెళ్తాడట. అదే ‘V' అనే అక్షరం. దాని వెనుక ఉన్న మర్మం ఏమిటి అనే దానిపై సుధీర్ బాబు చేసే విచారణే సినిమా కథ అని సమాచారం.


Click it and Unblock the Notifications











