టైం బ్యాడ్ కాబట్టే నానీ ఈ నిర్ణయం?

By Srikanya

హైదరాబాద్: హీరో అంటే కేవలం పాటలు,ఫైట్స్ తోనే కాదు నటనతోనూ మెప్పించవచ్చు అని నిరూపించిన యంగ్ హీరో నాని. అయితే ఆయన ఈ మధ్య కాలంలో బాగా ఎక్సపెక్ట్ చేసిన పెద్ద సినిమాలన్నీ భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ గా ఫలితాలు నమోదు అయ్యాయి. ఈగ హిట్టైనా దాని ఫలితం నాని ఖాతాలోకి వెళ్లలేదు. దాంతో పెద్ద సినిమాలకు నాని పనికిరాడు అనే నిర్ణయానికి చాలా మంది వచ్చేసారు. అందులోనూ నాని సినిమా అంటే బిజినెస్ పరంగా పెద్ద ఉత్సాహం కనపడటం లేదు. అయితే ఇటువంటి కీలక సమయంలోనే హీరోలు తీసుకునే నిర్ణయాలు వాళ్ల కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపిస్తాయి.

Nani wants to teaming with Avasarala Srinivas

ఈ నేపధ్యంలో నాని తన గత వైభవం తెచ్చుకోవటం కోసం దర్శకులను, స్క్రిప్టులును ఎంచుకునే పనిలో పడ్డాడు. అయితే తాజాగా నాని, తన స్నేహితుడు అవసరాల శ్రీనివాస్ కి డేట్స్ ఇచ్చాడని తెలుస్తోంది. మొదటి సినిమా రిలీజ్ కాకముందే అతని ప్రతిభమీద నమ్మకంతో ఈ సినిమా కమిటయ్యాడంటున్నారు. అయితే అసలే ఫ్లాపుల్లో ఉన్న ఈ సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవటం అవసరమా అని ఆయన్ని అభిమానించే ఇండస్ట్రీ వ్యక్తులు కామెంట్ చేస్తున్నారు. దానికి తోడు నాని హీరోగా చేసిన జెండాపై కపిరాజు చిత్రం సైతం బిజినెస్ లేక మూలన పడి ఉన్న సమయంలో కాస్త క్రేజ్ వచ్చే ప్రాజెక్టుని ఎంచుకోక ఎందుకీ సాహసం అని చెప్తున్నారు.

అయితే అవసరాల శ్రీనివాస్ చేసిన చిత్రం కొంత భాగం చూసే..నాని ఈ ఆఫర్ ఇచ్చాడంటున్నారు. అష్టాచెమ్మతో పరిచయమైన హీరోలు అవసరాల శ్రీనివాస్, నాని. నాని హీరోగా దూసుకెళ్ళి పెద్ద డైరక్టర్స్ చేసేసాడు. అయితే పెద్ద అనేదే కలిసిరాక ఫ్లాఫ్ లతో చతికిల పడ్డాడు. ఈ సమయంలో అవసరరాల శ్రీనివాస్ కొన్ని చిత్రాల్లో కమిడియెన్ గా చేసినా, తన దృష్టిని పూర్తిగా దర్శకత్వం మీదే కాన్సర్టేట్ చేసారు. రీసెంట్ గా ఆయన దర్శకుడుగా మారి ఊహలు గుసగుసలాడే అనే చిత్రం రూపొందించారు. ఇప్పుడు మళ్లీ ఇంతకాలానికి వీరిద్దరూ కలిసి పనిచేయనున్నారని సమాచారం. అయితే నాని నిర్ణయం కరెక్టు అయ్యి వీరి కాంబినేషన్ పెద్ద హిట్ కావచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X