మరో మారు నిర్మాతగా నాని.. హిట్ చిత్రానికి సీక్వల్‌గా!
నేటితరం టాలీవుడ్ హీరోలు ఒక్క సినిమాల్లో నటించడమే కాకుండా, సినిమా ఇండస్ట్రీకి సంబందించిన అన్ని రంగాల్లో రాణించేందుకు బాటలు వేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యం లోనే యంగ్ హీరోలు రామ్ చరణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు సినిమా నిర్మాణం వైపు అడుగులు వేశారు. అయితే అదే బాటలో నాచురల్ స్టార్ నాని కూడా ముందుకెళ్తుండటం విశేషం.
హీరోగా తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న నాచురల్ స్టార్ నాని గతంలో అ! అనే విలక్షణ కథాంశానికి నిర్మాతగా వ్యవహరించారు. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకతంలో సైకోలాజికల్ థ్రిల్లర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఈ కోవలోనే తాజాగా మరో డిఫెరెంట్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాకు నాని నిర్మాతగా వ్యవహరించబోతున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమా ప్రేక్షకాదరణ పొందటంతో ఈ సినిమాకు సీక్వల్ రూపొందించే పనిలో పడ్డారట యూనిట్ సభ్యులు. ఈ మేరకు అందుకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయట. అయితే ఆసక్తికర విషయమేమిటంటే ఈ సీక్వల్ కి నాచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించనుండటం. మొదటి భాగానికి నిర్మాతగా ఉన్న రాహుల్ యాదవ్ తో కలిసి నాని.. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ నిర్మాణంలో భాగం కానున్నారని ఫిలింనగర్ టాక్.
నవీన్ పొలిశెట్టి హీరోగా స్వరూప్ ఆర్ఎస్‌జే దర్శకత్వంలో తెరకెక్కిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాను రిలీజ్‌కి ముందే చూసిన నాని.. నీతో సినిమా చేస్తానని ఆ డైరెక్టర్‌కి మాటిచ్చాడు. ఈ మేరకు అదే సినిమాను సీక్వల్‌గా తన నిర్మాణంలో పూర్తిచేసేందుకు ముందుకొచ్చాడట నాని. ఈ విషయమై అతిత్వరలోనే అఫీషియల్ ప్రకటన రానుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











