Taraka Ratna Health: తారకరత్న చికిత్సకు అంత ఖర్చు.. ఆస్పత్రి బిల్స్ ఎవరు చెల్లిస్తున్నారో తెలుసా?

ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన నందమూరి హీరో తారకరత్న. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుని.. రాజకీయ ప్రయాణాన్ని మొదలు పెట్టాలని భావించే తరుణంలో హఠాత్తుగా కార్డియక్ అరెస్ట్ కు గురి కావడం సినీ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని అనేకమంది అభిమానులు, ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షించారు. ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదాయలయ ఆస్పత్రిలో మెరుగైన చికిత్స్ పొందుతున్న ఆయన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్ ద్వారా తెలియజేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన చికిత్సకు ఖర్చులు ఎవరు పెట్టుకున్నారనే ఓ వార్త వైరల్ గా మారింది.

 ఆరోగ్య విషయం గురించి..

ఆరోగ్య విషయం గురించి..

హీరోగా కొన్ని సినిమాల్లో అలరించిన నందమూరి తారకరత్న హఠాత్తుగా కార్డియక్ అరెస్ట్ కావడంతో సినీ లోకం ఒక్కసారిగా షాక్ కు గురైంది. అయితే ప్రస్తుతం తారకరత్నకు పూర్తిస్థాయిలో వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తూ ఆయనని మళ్లీ సాధారణ పరిస్థితుల్లోకి తీసుకురావాలని కృషి చేస్తున్నారు. ఇక ఈ క్రమంలో తారకరత్న ఆరోగ్య విషయం గురించి ఎప్పటికప్పుడు నందమూరి కుటుంబ సభ్యులు అలాగే ప్రముఖ రాజకీయ నాయకులు అడిగి తెలుసుకుంటున్నారు.

ప్రాథమిక చికిత్స తర్వాత..

ప్రాథమిక చికిత్స తర్వాత..

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో హీరో తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. కొద్ది దూరం నడిచిన ఆయన అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోవడంతో.. తారకరత్నను హుటాహుటిన పార్టీ కార్యకర్తలు కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స తర్వాత అక్కడి నుంచి పీఈఎస్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం తారకరత్నకు గుండెపోటు వచ్చిందని వైద్యులు తెలిపారు.

సిటీ స్కాన్ రిపోర్టులో..

సిటీ స్కాన్ రిపోర్టులో..

ప్రస్తుతం నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదాయలయ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో తారకరత్న ఆరోగ్యం క్రమంగా మెరుగవుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. అలాగే తారకరత్నకు చేసిన సిటీ స్కాన్ రిపోర్టులో వైద్యులు పలు కీలక విషయాలు గుర్తించినట్లు సమాచారం. ఆయనకు తక్కువ ఆక్సిజన్ అందడంతో బ్రెయిన్ కు ఎఫెక్ట్ అయినట్లు వైద్యులు తెలిపారు.

పాదయాత్ర సందర్భంగా ఇలా..

పాదయాత్ర సందర్భంగా ఇలా..

ఇదిలా ఉంటే తారకరత్న చికిత్సకు ఖర్చులు ఎవరు భరిస్తున్నారనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అందులో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం తారకరత్నకు చికిత్సకు సంబంధించిన పూర్తి ఖర్చులను తెలుగు దేశం పార్టీ వారు భరిస్తున్నట్లు న్యూస్ చక్కర్లు కొడుతోంది. అయితే నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా తారకరత్న గుండెపోటుకు గురి కావడం కారణంగా.. ఆ ఖర్చులను తానే భరిస్తానని టీడీపీ అధినేత నారా చంద్రబాబ నాయుడు ముందుకొచ్చారట.

తారకరత్న భార్యకు చెప్పినట్లుగా..

తారకరత్న భార్యకు చెప్పినట్లుగా..


పూర్తిగా తానే ఖర్చులు భరిస్తాననే విషయం తారకరత్న సతీమణికి కూడా చెప్పినట్లు సమచారాం. అయితే నందమూరి కుటుంబంలో ఇతరులతో పోల్చితే తారకరత్న ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని న్యూస్ వైరల్ అవుతోంది. అందుకే తారకరత్న చికిత్సకు అయ్యే భారీ ఖర్చును తానే చెల్లిస్తానని చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరికొందరు చంద్రబాబు మంచి మనసుతో ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియరాలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X