మోక్షజ్ఞ సినిమాతో మరో వారసుడు ఎంట్రీ?.. మామా అల్లుళ్ల సందడితో ఫ్యాన్స్​కు డబుల్​ ట్రీట్

నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు తెగ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మోక్షజ్ఞ ఎంట్రీపై రోజుకో న్యూస్ బయటకు వస్తోంది. నందమూరి బాలకృష్ణ ఆ మధ్య తన వారసుడు ఎంట్రీపై కూడా క్లారిటీ ఇచ్చాడు. ఎన్నికల తర్వాతే సినిమా ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే మరోసారి మోక్షజ్ఞ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్టేట్ వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే...

మోక్షజ్ఞ ఎంట్రీ: నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడు మోక్షజ్ఞ టాలీవుడ్ లోకి త్వరలోనే ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. అయితే మోక్షజ్ఞ ఎంట్రీపై రోజుకో వార్త బయటకు వస్తుంది. గత కొంతకాలంగా మోక్షజ్ఞ సినిమా గురించి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతుండగా మరో ఆసక్తి కరమైన వార్త వైరల్ గా మారింది. ఇక ఈ మోక్షజ్ఞ సినిమాలో నారా వారసుడు కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది.

Nara Lokesh son Devansh in Nandamuri Mokshagna Movie news viral in social media

మరో స్టార్ కిడ్: బాలయ్య వారసుడు మోక్షజ్ఞ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని ప్రచారం సాగుతోంది. ఇక ఈ సినిమాలో శ్రీలీలను ఫిక్స్ చేశారనే వార్తలు కూడా వచ్చాయి. బాలయ్యనే మోక్షజ్ఞకు శ్రీలీల అయితేనే కరెక్టు అని సెలెక్ట్ చేశారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ఇక ఈ సినిమాలో మరో స్టార్ కిడ్ నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Nara Lokesh son Devansh in Nandamuri Mokshagna Movie news viral in social media

నారా దేవాన్ష్: ఆ స్టార్ కిడ్ ఎవరో కాదా.. ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మనవడు దేవాన్ష్. నారా బ్రహ్మిణి, నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్... మోక్షజ్ఞ సినిమాలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో మోక్షజ్ఞ చిన్నప్పటి పాత్రలో దేవాన్ష్ నటింటనున్నట్లు టాక్. ఈ వార్త విన్న నందమూరి అభిమానులు తెగ సంబరపడితున్నారు. వెండితెరపై ఒకేసారి ఇద్దరు వారసులు ఎంట్రీ ఇస్తున్నారని మురిసిపోతున్నారు.

తమ్ముడి కోసం: ఇక నారాబ్రహ్మిణికి సినిమాలు అంటే పెద్దగా ఇష్టం ఉండదట. కానీ తమ్ముడి కోసం, కొడుకు ఇష్టం మేరకే ఒప్పుకుందని తెలుస్తోంది. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. ఇలా ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక అధికారిక ప్రకటన వచ్చే వరకు తెలియదు. ఇక మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య ఇటీవల స్పందించిన సంగతి తెలిసిందే. అమెరికాలో తానా సభలకు హాజరైన బాలయ్య.. అక్కడ మీడియా మోక్షజ్ఞ ఎంట్రీపై ప్రశ్నలు అడిగారు.

Nara Lokesh son Devansh in Nandamuri Mokshagna Movie news viral in social media

ఎన్నికల తర్వాతే: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత మోక్షజ్ఞ ఎంట్రీపై దృష్టి పెట్టనున్నట్లు బాలయ్య క్లారిటీ ఇచ్చాడు. ఇక ఈ మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పట్లో ఉండదని అర్థం అవుతుంది. కానీ ఈ మధ్య మోక్షజ్ఞ స్లిమ్ అండ్ హ్యాండ్సమ్ లుక్ లోకి మారిపోయాడు. అయితే ఆ లుక్ సినిమా కోసమేనని అభిమానులు అంతా అనుకున్నారు. చూడాలి ఇక బాలయ్య వారసుడు ఎంట్రీ ఎప్పుడు ఉండనుందోనని.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X