మూడో సినిమాకే కోటి డిమాండ్ చేస్తున్న హీరో
బాణంతో పరిచయమైన నారా రోహిత్ తన రెండో చిత్రం సోలో రీసెంట్ గా విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే కలెక్షన్స్ పరంగా సినిమా చాలా వీక్ గా ఉంది. అయితే తన మూడో చిత్రానికి మాత్రం కోటి డిమాండ్ చేస్తూ అందరినీ షాక్ కి గురి చేస్తున్నాడని ఫిల్మ్ నగర్ సమాచారం. సోలోకి ఇరవై ఐదు లక్షలు తీసుకున్న ఈ హీరో కి యావరేజ్ సినిమా పడగానే ఇలా రేటు పెంచేయటం అందరినీ ఆశ్చర్యపరుస్తోందని అంటున్నారు. అయితే అతనితో సినిమాలు చేయాలనుకునే నిర్మాతలు,దర్శకులు పెరగటంతో నారా రోహిత్ ఇలా డిమాండ్ పెంచాడంటున్నారు. ఇక రోహిత్ తాజాగా సి వి రెడ్డి నిర్మిస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నారు.
ఆ చిత్రాన్ని కథ చిత్రంతో పరిచయమైన శ్రీనివాస్ రాగ డైరక్ట్ చేస్తున్నారు. ఆ చిత్రం గురించి నారా రోహిత్ చెప్తూ..ఇక తన తదుపరి చిత్రాలు గురించి చెపుతూ..'కథ' దర్శకుడు శ్రీనివాస్ రాగ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాను. వాణిజ్య అంశాలు పుష్కలంగా ఉన్న కథాంశమది. నా పాత్ర, హావభావాలు భిన్నంగా ఉంటాయి. ఆ తర్వాత విజయ్‌కృష్ణ అనే ఓ కొత్త దర్శకుడితో సినిమా ఉంటుంది. ఐదో చిత్రం మళ్లీ పరశురామ్‌తోనే చేయబోతున్నా. ఒకదానితో ఒకటి సంబంధం లేని కథాంశాలే ఇవన్నీ అన్నారు.


Click it and Unblock the Notifications











