For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాబు పంక్షన్ కి చిరు ఛీఫ్ గెస్ట్?

    By Staff
    |

    Nara Rohit
    తెల్లారి లేస్టే ఒకరిపై మరొకరు ఘాటుగా విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్న చంద్రబాబు, చిరంజీవి త్వరలో ఒకే వేదికపై కనిపించనున్నారు. నారా చంద్రబాబు నాయుడు తన సోదరుడు రామ్మూర్తి నాయుడు కుమారుడు రోహిత్ హీరోగా ఓ చిత్రం ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అశ్వనీదత్ నిర్మాతగా ప్రారంభమయ్యే ఈ చిత్రాన్ని దంతులూరి చైతన్య అనే నూతన దర్శకుడు డైరక్ట్ చేయనున్నాడు. స్క్రిప్టు వర్క్ పూర్తయిన ఈ సినిమా ఈ నెల ఇరవై ఏడున లాంఛనంగా ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తున్నారని విశ్వసనీయ సమచారం. అయితే ఆ పూజా కార్యక్రమాలకు ముఖ్య అతిధి మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి.

    ఇక ఈ సినిమా నిర్మాణం కూడా రాజకీయంగా ఓ స్ట్రాటజీ ప్రకారమేనంటున్నారు. నిరాశచెందిన నారా రామ్ముర్తి నాయుడు బుజ్జగించటానికే ఈ ప్రయత్నం అని అంటున్నారు. చంద్రబాబు సలహాపైనే ఈ నిర్ణయానికి అశ్వనీదత్ వచ్చాడని తెలుస్తోంది. ఇక ఈ చిత్ర నిర్మాణానికి అయ్యే ఖర్చను కూడా బాబే భరించే అవకాశాలనున్నాయని గుసగుసలువినపడుతున్నాయి. గతంలో అశ్వనీదత్ చాలా మంది తెలుగు వారస హీరోలను విజయవంతంగా లాంచింగ్ చేసిన అనుభవంతో ఈ ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.

    ఇక ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్న దంతులూరి చైతన్య ప్రస్తుతం హ్యాపీడేస్ నికిల్ హీరోగా బసంతి అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. మొదట సురేష్ ప్రొడక్షన్స్ లో వినపించిన ఈ స్క్రిప్టు అక్కడ ఓకే కాకపోవటంతో అశ్వనీదత్ దగ్గరకు చేరింది. కొత్త బంగారు లోకం సినిమాకు పనిచేసిన టీమ్ లో కొంతమంది టెక్నికల్ ఈ చిత్రానికి సపోర్టు చేయనున్నారు. ప్రస్తుతం అశ్వనీదత్ తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. చిరంజీవి ప్రజారాజ్యం అధినేతగా కాక ఓ టాప్ హీరోగా ఈ ప్రారంభోత్సవానికి పిలవటానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X