నారా రోహిత్, పరుశరామ్ ల కాంబినేషన్ చిత్రం టైటిల్ ఏంటంటే...
ఆంజనేయులు, యువత చిత్రాల దర్శకుడు పరుశరామ్ తన తదుపరి చిత్రాన్ని నారా రోహిత్ తో ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సోలో అనే టైటిల్ పెట్టినట్లు సమాచారం. బాణం చిత్రంతో పరిచయమైన నారా రోహిత్ గ్యాప్ తీసుకుని చేస్తున్న ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా అభివర్ణిస్తున్నారు. యస్.వి.కె. సినిమా పతాకంపై పరశురామ్ (బుజ్జి) దర్శకత్వంలో వంశీకృష్ణ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.హీరో నారా రోహిత్ మాట్లాడుతూ...బాణం సినిమా తరువాత మంచి కధ కోసం ఎదురు చూస్తున్న సమయంలో పరుశురామ్ గారు మంచి కధ చెప్పారు.ఈ సినిమా తో మంచి సక్సెస్ వస్తుందని భావిస్తున్నాను అన్నారు.
ప్రకాష్‌రాజ్, షాయాజీ షిండే, జయసుధ, సుమలత, ఎం.ఎస్.నారాయణ, అలీ, శ్రీనివాసరెడ్డి, సుభాష్, జూ.రేలంగి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, అడిషనల్ స్క్రీన్‌ప్లే: సత్య, నిర్మాత: వంశీకృష్ణ శ్రీనివాస్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పరశురామ్ (బుజ్జి).


Click it and Unblock the Notifications











