For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘పుష్ప’ కోసం అల్లు అర్జున్ మాస్టర్ ప్లాన్.. ఖతర్నాక్ పోలీస్ పాత్రలో సెన్సిబుల్ హీరో.!

  By Manoj
  |

  సినిమా సినిమాకు లుక్‌లో వేరియేషన్ చూపిస్తూ... తెలుగు ప్రజలకు ఎన్నో స్టైల్స్‌ను పరిచయం చేసి స్టైలిష్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. బడా ఫ్యామిలీ నుంచి తెరంగేట్రం చేసినప్పటికీ... యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్నింటిలోనూ రాణిస్తూ స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతోన్న బన్నీ... వరుసగా భారీ చిత్రాల్లోనే నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం 'పుష్ప' అనే మూవీ చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ కోసం నారా రోహిత్‌తో కలిసి అతడు మాస్టర్ ప్లాన్ వేశాడట. ఆ వివరాలు మీకోసం.!

  ‘అల’ ఇండస్ట్రీ హిట్ కొట్టేసిన అల్లు అర్జున్

  ‘అల’ ఇండస్ట్రీ హిట్ కొట్టేసిన అల్లు అర్జున్

  గత సంక్రాంతికి ‘అల.. వైకుంఠపురముతో' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీతో అతడు ఇండస్ట్రీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. కలెక్షన్లకు కలెక్షన్లు.. టాక్‌కు టాక్ తెచ్చుకుని బన్నీ కెరీర్‌లోనే బెస్ట్ మూవీగా నిలిచింది. అంతేకాదు, ఇందులోని పాటలు టాలీవుడ్‌లో చరిత్రను సృష్టించాయి.

  ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన దర్శకుడితో ‘పుష్ప’గా

  ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన దర్శకుడితో ‘పుష్ప’గా

  అల్లు అర్జున్‌కు ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన దర్శకుడు సుకుమార్. ఆయన తీసిన ‘ఆర్య'తో ఈ మెగా హీరో కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడదే దర్శకుడితో బన్నీ.. ‘పుష్ప' అనే సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌తో రాబోతున్న ఈ మూవీ ఐదు భాషల్లో తెరకెక్కనుంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.

  స్మగ్లర్‌గా బన్నీ.. ఫస్ట్ లుక్‌తో సెన్సేషన్

  స్మగ్లర్‌గా బన్నీ.. ఫస్ట్ లుక్‌తో సెన్సేషన్

  ఈ సినిమాలో అల్లు అర్జున్ గంథపు చెక్కల స్మగ్లర్‌గా నటించబోతున్నాడని ఎప్పటి నుంచో ప్రచారం జరిగింది. అందుకు అనుగుణంగానే ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌లో అతడు దర్శనమిచ్చాడు. అంతేకాదు, ఈ పోస్టర్‌లో బన్నీ కాలికి ఆరు వేళ్లు కనిపించాయి. దీంతో ఈ మూవీపై అప్పటి నుంచే బజ్ ఏర్పడింది. అలాగే, రోజుకో వార్త బయటకు వస్తుండడంతో అంచనాలు పెరుగుతున్నాయి.

  తమిళ స్టార్ ఔట్.. బాలీవుడ్ స్టార్ ఇన్

  తమిళ స్టార్ ఔట్.. బాలీవుడ్ స్టార్ ఇన్

  ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో తమిళ సూపర్ స్టార్ విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటించాల్సి ఉంది. అయితే, అనివార్య కారణాల వల్ల ఆయన ఈ మూవీ నుంచి తప్పుకున్నారని అప్పట్లో ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీంతో ఆయన స్థానంలో బాలీవుడ్‌లో పేరున్న ఓ హీరోను తీసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.

  ‘పుష్ప’ కోసం అల్లు అర్జున్ మాస్టర్ ప్లాన్

  ‘పుష్ప’ కోసం అల్లు అర్జున్ మాస్టర్ ప్లాన్


  కరోనా కారణంగా ‘పుష్ప' మూవీ షూటింగ్ వాయిదా పడిపోయింది. అంతేకాదు, లొకేషన్ల విషయంలోనూ చిత్ర యూనిట్‌కు నిరాశ తప్పలేదు. దీంతో సెట్స్ వేయడమా.. లేక కొత్త లొకేషన్స్ ఎంచుకోవడమా అన్న మీమాంశలో ఉంది. ఈ నేపథ్యంలో సినిమా కోసం బన్నీ మాస్టర్ ప్లాన్లు సిద్ధం చేస్తున్నాడట. ఇందులో భాగంగానే లొకేషన్ల వేటను సైతం మొదలెట్టాడని టాక్.

  Bigg Boss Telugu 4 Episode 5 Highlights దివి, అమ్మా రాజశేఖర్ రొమాంటిక్‌గా
  తెలుగు హీరోను అలా వాడుతున్నాడా.!

  తెలుగు హీరోను అలా వాడుతున్నాడా.!

  ఇందులో నారా రోహిత్ కీలక పాత్ర పోషిస్తున్నాడని ఇటీవల ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా దీని గురించి మరో న్యూస్ బయటకు వచ్చింది. ఆ యంగ్ హీరోను బన్నీనే స్వయంగా ఎంపిక చేశాడట. సినిమాలో క్రూరమైన ఓ పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసమే అతడిని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి దీనికి రోహిత్ ఒప్పుకున్నాడా అన్నది తెలియాల్సి ఉంది.

  English summary
  Many months after announcing the Allu Arjun-Sukumar movie, it was formally launched on Few Days Back. Mythri Movie Makers and Muttamsetty Media will jointly produce this movie. 'Sarileru Neekevvaru' star Rashmika Mandanna romances the Mega hero.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X