రెజీనాతో అఫైర్.. నారా రోహిత్ క్లారిటీ..
అందాల తార రెజీనా కసాండ్రాతో అఫైర్ వార్తలు మీడియాలో ఇటీవల బాగానే వినిపిస్తున్నాయి. ఆ మధ్యలో మెగా హీరో సాయిధరమ్ తేజ్‌తో రెజీనా పెళ్లి జరుగబోతున్నదనే వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి.
Recommended Video

అందాల తార రెజీనా కసాండ్రాతో అఫైర్ వార్తలు మీడియాలో ఇటీవల బాగానే వినిపిస్తున్నాయి. ఆ మధ్యలో మెగా హీరో సాయిధరమ్ తేజ్‌తో రెజీనా పెళ్లి జరుగబోతున్నదనే వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. తాజాగా నారా రోహిత్‌తో రెజీనా అఫైర్ సాగుతున్నదనే వార్త సంచలనంగా మారింది.

రెజీనాతో అఫైర్ గురించి
రెజీనాతో లవ్ అఫైర్ నడుస్తోంది అని వస్తున్న వార్తలపై తాజాగా నారా రోహిత్ స్పందించారు. రెజీనాతో అఫైర్ అని వైరల్ అవుతున్న వార్తలు నా దృష్టికి వచ్చాయి. ఈ వార్తల్లో వాస్తవం లేదు. నేనేమీ సీరియస్‌గా తీసుకోలేదు అని నారా రోహిత్ అన్నారు.

ఆ వార్త గురించి నాకు తెలుసు
గతంలో రెజీనాతో శంకర, జో అచ్యుతానంద చిత్రాల్లో నటించా. ప్రస్తుతం బాలకృష్ణుడు సినిమాల్లో కలిసి నటిస్తున్నాను. మొదటి సినిమా నుంచి ఈ గాసిప్ వినిపిస్తున్నది అని రోహిత్ అన్నారు.

అదే కారణమై ఉంటుంది.
తరుచుగా మేమిద్దరం కలిసి నటిస్తున్నాం. రూమర్, గాసిప్స్ వైరల్ కావడానికి ఇది కూడా ఒక కారణం అయి ఉంటుంది. మేము ప్రొఫెషనల్ రిలేషన్ షిప్ షేర్ చేసుకున్నాం. అది తప్ప మా మధ్య మరో విషయం లేదు అని రోహిత్ తెలిపారు.

సాయిధరమ్ తేజ్‌తో అఫైర్
కాగా, సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్ర షూటింగ్‌లో రెజీనా, సాయి ధరమ్ తేజ్ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెద్దలకు తమ ప్రేమ విషయం చెప్పి ఒప్పించినట్టు గాసిప్స్ వినిపించాయి.

రెజీనా కసాండ్రా స్పందన ఇదే..
తనపై వస్తున్న గాసిప్స్‌పై ఆ మధ్య రెజీనా కూడా స్పందించారు. సాయిధరమ్ తేజ్ కేవలం ఉన్న ప్రొఫెషనల్ రిలేషన్ షిప్ మాత్రమే అనే స్పష్టం చేశారు. తన దృష్టి అంతా ప్రస్తుతం కెరీర్‌పైనే అని రెజీనా వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











