మల్టీస్టారర్‌గా రాబోతున్న BB3: బాలయ్య సినిమాలో మరో హీరో.. బోయపాటి ప్లాన్ అదిరిందిగా!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీల ప్రాధాన్యం క్రమంగా పెరుగుతోంది. అప్పట్లో పెద్దగా ఈ తరహా చిత్రాలు రాలేదు. కానీ, ఈ మధ్య కాలంలో చిన్న హీరోల నుంచి బడా స్టార్ల వరకు ఇలాంటి సినిమాలు చేసేందుకు ముందుకొస్తున్నారు. ఈ కారణంగానే ఇటీవలి కాలంలో ఎన్నో మల్టీస్టారర్ మూవీలు పట్టాలెక్కేశాయి. ఈ క్రమంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న నందమూరి బాలకృష్ణ.. బోయపాటి శ్రీను సినిమాను కూడా మల్టీస్టారర్‌గానే తెరకెక్కిస్తున్నారని తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఇందులో మరో హీరో కూడా నటిస్తున్నాడట. దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

హ్యాట్రిక్ కోసం మరోసారి.. కెరీర్‌లోనే భారీగా

హ్యాట్రిక్ కోసం మరోసారి.. కెరీర్‌లోనే భారీగా

'సింహా', 'లెజెండ్' వంటి రెండు భారీ హిట్‌ల తర్వాత మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో జత కట్టాడు నందమూరి బాలకృష్ణ. BB3 అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రం ద్వారా హ్యట్రిక్ కొట్టాలని వీళ్లిద్దరూ పట్టుదలతో ఉన్నారు. ఈ చిత్రాన్ని బాలయ్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. దీనికి ఎస్ ఎస్ థమన్ సంగీతం సమకూర్చుతున్నాడు.

ఆ వీడియోతో తారుమారు... బిజినెస్ స్టార్ట్

ఆ వీడియోతో తారుమారు... బిజినెస్ స్టార్ట్

నిజానికి బోయపాటి - బాలయ్య కలయికలో రాబోతున్న ఈ సినిమాపై మొదట్లో ఏమాత్రం అంచనాలు లేవు. దీంతో మార్కెట్ కూడా జరిగే అవకాశాలు కనిపించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో విడుదలైన టీజర్.. మొత్తాన్ని మార్చేసింది. అందులో బాలయ్య చెప్పిన డైలాగ్‌తోనే అంచనాలు పెరిగిపోయాయి. దీంతో ఈ మూవీ బిజినెస్ కూడా భారీగానే జరిగినట్లు తెలుస్తోంది.

ఆ విషయాల్లో నో క్లారిటీ.. పేర్లు మాత్రం ఇవే

ఆ విషయాల్లో నో క్లారిటీ.. పేర్లు మాత్రం ఇవే

ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నటించే హీరోయిన్ల విషయంలో అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటి వరకూ వెలువడలేదు. కానీ, ఎంతో మంది పేర్లు తెరపైకి వస్తున్నాయి. వీరిలో ప్రగ్యా జైస్వాల్, సాయేషా సైగల్ కన్ఫార్మ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే, విలన్ పాత్రకూ ఇదే విధంగా ఉంది. సునీల్ శెట్టి, శ్రీకాంత్, నవీన్ చంద్ర సహా ఎంతో మంది నెగెటివ్ రోల్స్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

బాలయ్య ప్రయోగం.. వర్కౌట్ అవుతుందా?

బాలయ్య ప్రయోగం.. వర్కౌట్ అవుతుందా?

ఇందులో నందమూరి బాలకృష్ణ చేస్తున్న పాత్ర విషయంలోనూ ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో ఆయన అఘోరా రోల్‌లో కనిపించబోతున్నాడన్న వార్త హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ఆ మధ్య బోయపాటి కూడా చెప్పకనే చెప్పారు. దీనితో పాటు ఓ పవర్‌పుల్ రైతు పాత్రలోనూ బాలయ్య నటిస్తున్న విషయం తెలిసిందే.

మల్టీస్టారర్‌గా BB3: సినిమాలో మరో హీరో

మల్టీస్టారర్‌గా BB3: సినిమాలో మరో హీరో

పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమా గురించి రోజుకో వార్త ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే దీనిని మల్టీస్టారర్ మూవీగా రూపొందిస్తున్నారని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఇందులో నారా రోహిత్ కూడా నటిస్తున్నాడట. గతంలోనే ఈ వార్త లీకైనప్పటికీ.. దీని గురించి కొన్ని వివరాలు తాజాగా బయటకొచ్చాయి.

Recommended Video

Nandamuri Mokshagna To Kick Start His Debut Soon | Filmibeat Telugu
హీరో విషయంలో బోయపాటి ప్లాన్ అదిరింది

హీరో విషయంలో బోయపాటి ప్లాన్ అదిరింది

ఈ సినిమాలో నారా రోహిత్ చేసేది వినూత్నమైన పాత్ర అని తెలుస్తోంది. మొదట్లో ఇది అతిథి పాత్రే అని ప్రచారం జరిగినప్పటికీ.. అతడు చేసేది ఫుల్ లెంగ్త్ రోల్ అని తాజాగా తెలిసింది. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకూ ఉండే ఈ పాత్ర సినిమాకే హైలైట్‌గా నిలవనుందట. దీన్ని ఎంతో స్పెషల్‌గా డిజైన్ చేశాడట బోయపాటి. ఈ పాత్రే సినిమాను మలుపు తిప్పుతుందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X