చిరంజీవి సినిమాలో యంగ్ హీరో క్యామియో?.. మెగా 158 కోసం బాబీ భారీ ప్లానింగ్!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే 'విశ్వంభర' చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్న ఆయన, మరోవైపు దర్శకుడు బాబీ కొల్లితో తన తదుపరి చిత్రాన్ని కూడా సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. తాత్కాలికంగా 'మెగా 158'గా పిలుస్తున్న ఈ సినిమా ఇటీవల ఘనంగా ప్రారంభమైంది. ఈ లాంచ్ ఈవెంట్‌కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరవడం విశేషం. దీంతో ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.

'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి-బాబీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మాస్, ఎమోషన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో కూడిన పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా, సినిమాకు సంబంధించిన చిన్న వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Nara Rohith to Play a Key Cameo in Chiranjeevi s Mega158 Buzz Creates Excitement

ఇప్పటికే ఈ సినిమాలో సీనియర్ నటి ప్రియమణి కీలక పాత్రలో నటిస్తున్నారని, మలయాళ యంగ్ హీరోయిన్ అనశ్వర రాజన్ చిరంజీవి కుమార్తె పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. అలాగే నివేతా పేతురాజ్ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది.

అదేంటంటే.. ఈ సినిమాలో కీలక అతిథి పాత్ర కోసం యంగ్ హీరో నారా రోహిత్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్న నారా రోహిత్, 'సుందరకాండ', 'భైరవం' వంటి సినిమాలతో మంచి ఫామ్‌లో ఉన్నాడు. విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన ఇప్పుడు సీనియర్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలకు మొదటి ఎంపికగా మారుతున్నాడనే టాక్ వినిపిస్తోంది.

సినీ వర్గాల సమాచారం ప్రకారం ..'మెగా 158'లో సెకండాఫ్‌లో వచ్చే ఒక కీలక పాత్ర కోసం పలువురు యువ హీరోల పేర్లను పరిశీలించిన బాబీ, చివరకు నారా రోహిత్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. కథలో ఈ పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుందని, క్లైమాక్స్‌కు ముందు కథను మలుపు తిప్పే పాత్రగా ఇది ఉండబోతుందని ప్రచారం జరుగుతోంది.

కొన్ని కథనాల ప్రకారం.. చిరంజీవి కుమార్తె పాత్రలో నటిస్తున్న అనశ్వర రాజన్‌కు జోడీగా లేదా వరుడిగా నారా రోహిత్ కనిపించే అవకాశం ఉందని చెబుతున్నారు. పాత్ర నిడివి తక్కువైనా కథలో ప్రభావం ఎక్కువగా ఉంటుందని సమాచారం. ముఖ్యంగా చిరంజీవి వంటి లెజెండరీ నటుడితో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడంతో రోహిత్ కూడా సానుకూలంగా స్పందించినట్లు ఫిల్మ్ నగర్ టాక్.

ఇక నారా రోహిత్ కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం ఆయనకు వరుస అవకాశాలు వస్తున్నాయి. విక్టరీ వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'ఆదర్శ కుటుంబం - హౌస్ నెం.47'లో కూడా ఆయన కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవైపు వెంకటేశ్ సినిమా, మరోవైపు చిరంజీవి సినిమా.. ఇలా ఇండస్ట్రీలోని ఇద్దరు అగ్ర హీరోల ప్రాజెక్టుల్లో భాగమవుతున్న నారా రోహిత్ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయాడు.

మరోవైపు 'మెగా 158'ను కన్నడ ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ (KVN) ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. నిర్మాతలు వెంకట్ కె.నారాయణ, లోహిత్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. సంగీత దర్శకుడు తమన్ సంగీతం అందిస్తుండగా, బాబీ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌కు చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్ తోడైతే బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. అయితే నారా రోహిత్ పాత్రపై ఇప్పటివరకు మూవీమేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X