మల్టీస్టారర్‌గా బాలకృష్ణ కొత్త సినిమా: కీలక పాత్ర కోసం అల్లుడిని తీసుకున్న నటసింహా

నందమూరి తారక రామారావు తనయుడిగా సినిమాల్లోకి ప్రవేశించినా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు నటసింహా నందమూరి బాలకృష్ణ. కెరీర్ ఆరంభంలో క్లాస్ సినిమాల్లో నటించిన ఆయన.. ఆ తర్వాత మాస్ హీరోగా గుర్తింపు పొందాడు. సుదీర్ఘమైన సినీ కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను అందుకుని సత్తా చాటుతున్నాడాయన. సరైన హిట్ కోసం అన్వేషిస్తున్న బాలయ్య.. తన కొత్త సినిమా విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నాడని తాజాగా ఓ న్యూస్ లీకైంది. అంతేకాదు, ఆ మూవీలో తన అల్లుడిని తీసుకుంటున్నాడట. ఆ సంగతులేంటో చూద్దాం పదండి.!

బాలకృష్ణకు అస్సలు కలిసి రాలేదుగా

బాలకృష్ణకు అస్సలు కలిసి రాలేదుగా

కెరీర్ ఆరంభంలో ఏడాదికి ఐదారు సినిమాలు చేసుకుంటూ వచ్చారు నందమూరి బాలకృష్ణ. అయితే, ఈ మధ్య వేగం తగ్గించిన ఆయన కనీసం రెండు సినిమాలతోనైనా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే, ఊహించని విధంగా పోయిన సంవత్సరం ఆయన ఏకంగా మూడు సినిమాలను విడుదల చేశారు. దురదృష్టవశాత్తూ అవన్నీ బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి.

హిట్ కాదు.... హ్యాట్రిక్ కోసం కలిశారు

హిట్ కాదు.... హ్యాట్రిక్ కోసం కలిశారు

వరుస పరాజయాలతో ఇబ్బందులను ఎదుర్కొంటోన్న బాలకృష్ణ.. ఈ సారి కచ్చితంగా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం తనకు గతంలో ‘సింహా', ‘లెజెండ్' వంటి రెండు భారీ విజయాలను అందించిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో జత కట్టాడు. అంతకు ముందు వచ్చిన రెండు సినిమాలకు మించిన హిట్‌తో హ్యాట్రిక్ కొట్టాలని ఈ కాంబో భావిస్తోంది.

కెరీర్‌లో పెద్ద మూవీ.. మరోసారి అలా

కెరీర్‌లో పెద్ద మూవీ.. మరోసారి అలా

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి బాలయ్య కెరీర్‌లోనే తొలిసారి యాభై కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించారు. ఇక, ఈ సినిమాలో నటసింహా రెండు డిఫరెంట్ రోల్స్ చేస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అందులో ఒకటి అఘోరా పాత్ర అని కూడా చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

 ఒక్క వీడియో.. మొత్తం మార్చేసింది

ఒక్క వీడియో.. మొత్తం మార్చేసింది

వాస్తవానికి క్రేజీ కాంబినేషన్ అయినప్పటికీ ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. దీంతో ఈ ప్రాజెక్టును కొనుగోలు చేసేందుకు బయ్యర్లు కూడా ముందుకు వచ్చేలా కనిపించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో BB3 పేరిట ఓ వీడియోను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. పవర్‌ఫుల్‌గా సాగిన ఈ వీడియోకు అన్నీ పర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యాయి. ఫలితంగా సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి.

మల్టీస్టారర్‌గా బాలకృష్ణ కొత్త సినిమా

మల్టీస్టారర్‌గా బాలకృష్ణ కొత్త సినిమా

రెండు సూపర్ హిట్ల తర్వాత వస్తున్న ఈ భారీ చిత్రానికి సంబంధించి రోజుకో వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతూనే ఉంది. ఇందులో పలానా నటుడు విలన్‌గా చేస్తున్నాడని, పలానా హీరోయిన్ నటిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ఇందులో విలన్‌గా శ్రీకాంత్ నటిస్తున్నాడని ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఈ క్రమంలోనే దీనికి సంబంధించి మరో రూమర్ హల్‌చల్ చేస్తోంది.

కీలక పాత్ర కోసం అల్లుడికి అవకాశం

కీలక పాత్ర కోసం అల్లుడికి అవకాశం

తాజా సమాచారం ప్రకారం... బాలయ్య - బోయపాటి కాంబనేషన్‌లో వస్తున్న ఈ సినిమా మల్టీస్టారర్‌గా రాబోతుందట. ఇందులో మరో పాత్ర కోసం నారా రోహిత్‌ను తీసుకుంటున్నారని తెలిసింది. కొంచెం నెగటివ్ షేడ్స్ ఉన్న ఈ పాత్ర సినిమాలో ఎంతో కీలకమైనదని సమాచారం. ఈ రోల్ కోసం పలువురు పేర్లను పరిశీలించినప్పటికీ.. తన అల్లుడికే ఓటేశాడట నటసింహా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X