twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెకండ్ వేవ్ తరువాత రిలీజ్ అయ్యే మొదటి పెద్ద తెలుగు సినిమా ఏదంటే ?

    |

    తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు నెమ్మదిగా తగ్గుతున్న సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో ఇప్పటికే విధించిన లాక్ డౌన్ ను చాలావరకు సడలించారు. తెలంగాణలో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుండగా ఆంధ్రప్రదేశ్లో మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతోంది. పాజిటివ్ రేటు కూడా తగ్గుతున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో పూర్తి స్థాయిలో సడలింపు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జరుగుతున్న ప్రచారం మేరకు జూలై ఒకటో తేదీ నుంచి తెలంగాణలో 50 శాతం ఆక్యుపెన్సీ థియేటర్లు ఓపెన్ చేసుకునే అవకాశం ఇస్తారని అంటున్నారు.

    ఒక వారం రోజుల తర్వాత పూర్తిస్థాయిలో సినిమా థియేటర్లు నడిచే లా అనుమతి ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరో పక్క ఏపీలో కూడా థియేటర్ల ఓపెనింగ్ విషయంలో ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక ఒకవేళ అదే జరిగితే ముందుగా రిలీజయ్యే పెద్ద సినిమాలలో వెంకటేష్ హీరోగా నటిస్తున్న నారప్ప సినిమా పేరు అన్నిటికంటే ముందు వినిపిస్తోంది. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన అసురన్ సినిమాని తెలుగులో నారప్ప పేరుతో శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించారు.

    Narappa to be the first tollywood big release after the second wave

    ప్రియమణి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కార్తీక్ రత్నం కీలక పాత్రలో నటించాడు. థియేటర్ లు ఓపెన్ అయ్యాక రిలీజ్ అయ్యే పెద్ద సినిమాలలో మొదటిదిగా ఈ సినిమానే నిలిచే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయ్యాయి. మరో వారంలో ఫస్ట్ కాపీ కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కలై పులి es థాను, సురేష్ బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.. అయితే మరి ఇందులో నిజానిజాలు ఏమేరకు ఉన్నాయనేది సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే..

    English summary
    Venkatesh Daggubati starrer Narappa to be the first tollywood big release after the second wave. Its Telugu remake of the blockbuster Tamil movie Asuran.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X