హీరోయిన్-నిర్మాత ఎఫైర్....మరోసారి దొరికిపోయారు!
హైదరాబాద్ : బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రి, నిర్మాత, నటుడు ఉదయ్ చోప్రా చాలా కాలంగా క్లోజ్‌గా మూవ్ అవుతున్నారు. వారు చాలా సార్లు కలిసి మీడియా కంట పడ్డప్పటికీ....డేటింగ్ చేస్తున్నామనే విషయాన్ని మాత్రం ఒప్పుకోవడం లేదు. వీరిద్దరి మధ్య ఎఫైర్ సాగుతోందనే విషయం మరోసారి వెల్లడైంది. తాజాగా వీరు సిక్రెట్‌గా ఓ సినిమా థియేటర్‌కు వచ్చి దొరికిపోయారు.
నర్గీస్ ఫక్రి నటించిన 'మద్రాస్ కేఫ్' చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ చిత్రంలో నర్గీస్ ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ పాత్రను పోషించింది. ఆమెతో డేటింగ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయ్ చోప్రా ఈ సినిమా చూడటానికి ఆమెతో ప్రత్యేకంగా వచ్చారు. కొందరు చెప్పిన వివరాల ప్రకారం వీరు సాయంత్రం 6 గంటలకు షోకు వచ్చారని...కలిసి సినిమా చూసి 9 గంటలకు వేర్వేరు కార్లలో వెళ్లి పోయారని తెలుస్తోంది. థియేటర్లో వీరిద్దరు లోన్లీగా గడిపారని, చాలా సేపు ఊసులాడుకున్నారని తెలుస్తోంది.

నర్గీస్ ఫక్రికి ఉదయ్ చోప్రా చాలా స్పెషల్ ఫ్రెండ్ అని....బయటకు చెప్పక పోయినా వీరి మధ్య రహస్యంగా ఎఫైర్ నడుస్తోందని, వారి వ్యవహార శైలి, ఎవరికీ తెలియకుండా రహస్యంగా కలవడం లాంటి పరిణామాలు పరిశీలిస్తే ఇద్దరి మధ్య డేటింగ్ నడుస్తోందని స్పష్టం అవుతోందని బాలీవుడ్ జనాలు అంటున్నారు.
గతంలో వీరు ఒకరికొకరు చేసుకున్న ట్వీట్లు కూడా వీరి మధ్య ఎఫైర్ ఉందనడానికి బలం చేకూరుస్తోంది. "long time no tweet- just asking people, 5 things they are grateful for. Curious to hear what u r grateful for? Do share" అని నర్గీస్ ట్వీట్ చేస్తే, "I'm grateful for your beautiful smile, ur gorgeous face, ur amazing body, ur striking personality and ur positivity" అని ఉదయ్ చోప్రా ట్వీట్ చేసారు.


Click it and Unblock the Notifications











