Don't Miss!
- Sports SRH vs RCB: ఫుల్ టాస్కు ఔటైన మార్క్రమ్.. నవ్వు ఆపుకోలేకపోయిన కోహ్లీ!వీడియో
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- News కాలేజ్ అమ్మాయి ఇంటికి వెళ్లిన సీఎం, పోలింగ్ కు ఒక్కరోజు ముందు ప్రతిపక్షాలకు ఝలక్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జిస్మ్-3లో.... సన్నీని తలదన్నే సెక్సీలేడీ?
ముంబై: ఇటీవల విడుదలైన 'జిస్మ్-2' చిత్రంలో పోర్న్ స్టార్ సన్నీ లియోన్ తన న్యూడ్ అందాల ఆరబోతతో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే సినిమా మాత్రం నెగెటివ్ టాకే తెచ్చుకుంది. సినిమా అభిమానుల అంచనాలకు తగిన విధంగా లేక పోవడం, సన్నీ లియోన్ కు అసలు నటన రాక పోవడం, పూజా భట్ దర్శకత్వంలో ఫెయిల్ అవ్వడమే ఇందుకు కారణం.
కాగా....దర్శకురాలు పూజాభట్ భవిష్యత్‌లో 'జిస్మ్ 3' చిత్రానికి ప్లాన్ చేస్తోందట. ఆ చిత్రంలో హాట్ మోడల్, ఐటంగర్ల్ నథాలియా కౌర్‌ను తీసుకునే ఆలోచనలో ఉందని సమాచారం. భట్ కుటుంబం రూపొందించే సినిమాలకు సెక్స్, ఎక్స్ ఫోజింగ్ అనేవి ప్రధాన ముడి సరుకులు కాబట్టి ఆ సరుకు బాగా ఉన్న భామలపైనే వీరికళ్లు ఉంటాయని, అందుకే తన సెక్సీ సరుకు చూపించడంలో ఏమాత్రం మొహమాట పడని నథాలియాపై వారి చూపులు పడ్డాయని బాలీవుడ్ టాక్. ఇదే విషయాన్ని పూజా భట్ ను అడిగితే...తాను ఇప్పుడే ఆ విషయాన్ని చెప్పలేనని అంటోంది.
డిపార్ట్మెంటు చిత్రం ద్వారా బాలీవుడ్ కి పరిచయం అయిన ఐటం బాంబు నథాలియా కౌర్ ఆ చిత్రంలోని ఐటం సాంగులో ఏ రేంజ్లో అందాలు ఆరబోసిందో తెలిసిందే. బికినీకి ఏమాత్రం తీసి పోని డ్రెస్సుతో విచ్చల విడిగా అందాలు చూపించి ఒక్కసారి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది ఈ బ్రెజిల్ భామ.
నగ్నంగా నటించడానికి కూడా నథాలియాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆ మధ్య ఈ విషయమై మాట్లాడుతూ.... వర్మ తీసే ప్రతి సన్నివేశం కళాత్మకంగానే ఉంటుంది. వల్గర్‌గా ఆయన తీయరు. అందుకే భారం ఆయనపై వదిలేసి చేసేస్తా. ఒకవేళ వల్గర్‌గా అన్పించేలా నేను శృతిమించినా అది కట్ చేయడానికి సెన్సార్ వాళ్ళు ఉన్నారుగా అంది. ఆయన అడిగితే అలా పూర్తిగా న్యూడ్ గా కనిపించడానికి నాకెలాంటి అభ్యంతరం లేదని గతంలోని స్పష్టం చేసింది. మరి ఇలా రెచ్చిపోయే వాళ్లే కావాలి భట్ ఫ్యామిలీ తీసే సినిమాలకు.