విచ్చల విడిగా రెచ్చిపోతానంటోంది!
రామ్ గోపాల్ వర్మ కొత్తగా పరిచయం చేసిన ఐటం బాంబు నథాలియా కౌర్....డిపార్ట్‌మెంటు చిత్రంలోని ఐటం సాంగులో ఏ రేంజ్‌లో అందాలు ఆరబోసిందో తెలిసిందే. బికినీకి ఏమాత్రం తీసి పోని డ్రెస్సుతో విచ్చల విడిగా అందాలు చూపించి ఒక్కసారి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది ఈ బ్రెజిల్ భామ.
సినిమా ఇంకా విడుదల కానప్పటికీ...ఆమె నటించిన 'డన్ డన్' పాట ఇటీవలే యూట్యూబ్‌లో విడుదలైంది. ఈ పాటలో నథాలియా పెర్ఫార్మెన్స్ చూసి కుర్రకారు వెర్రెతి పోతున్నారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ లేని విధంగా, అశ్లీలతకు మారు పేరుగా ఈ పాటను చిత్రీకరించారు.
ఈ మధ్య సినీ జనాల్లోనూ బూతు పాటలంటే మక్కువ ఎక్కువవుతోంది. పాటలో ఎంత బూతు ప్రేక్షకులు ఎక్కవగా ఆదరిస్తున్నారు. ఫ్యామిలీ జనాలు ఇలాంటి చూడటానికి ఇష్ట పడరని తెలిసినా.....తమ సినిమాలకు ఎక్కువ వచ్చే ఆ బాపతుగాళ్లను దృష్టిలో పెట్టుకుని దర్శకులు కూడా రెచ్చిపోతున్నారు.
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో నథాలియా లాంటి వారు మరింత రెచ్చిపోతున్నారు. ఇదే అదునుగా తమ అందాలను విచ్చల విడిగా చూపించి....క్యాష్ చేసుకుంటున్నారు. తను చేసిన పాటకు తెగ డిమాండ్ రావడంతో చాలా మంది దర్శక నిర్మాతలు ఆమెను తమ సినినిమాలో తీసుకునే ఆలోచనలో ఉన్నారు. తనకు డిమాండ్ బాగా ఉండటంతో నథాలియా ఐటం సాంగుకు రూ. 2 కోట్లు డిమాండ్ చేస్తోందట.


Click it and Unblock the Notifications











