చిరంజీవికి జోడీగా నేషనల్ అవార్డ్ విన్నర్ బ్యూటీ! బాబీ అసలు ప్లాన్ అదేనా?

సంక్రాంతి కానుకగా విడుదలైన 'మన శంకర వరప్రసాద్ గారు'తో మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన బాక్సాఫీస్ స్టామినాను నిరూపించారు. ఇప్పటి వరకు రూ. 380 కోట్లకుపైగా కలెక్షన్లు వసూలు చేసి, చిరు కెరీర్ లో భారీ కమర్షియల్ హిట్‌గా క్రియేట్ చేసింది. ఈ గ్రాండ్ సక్సెస్ తర్వాత ఆయన తదుపరి ప్రాజెక్టులపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే దర్శకుడు బాబీ కొల్లితో రెండోసారి సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే ప్రాజెక్ట్‌కు సంబంధించిన లేటెస్ట్ రూమర్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా చిరంజీవికి జోడీగా నేషనల్ అవార్డ్ విన్నర్ బ్యూటీ నటించబోతుందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు?

చిరంజీవి కెరీర్‌లో 158వ సినిమాగా తెరకెక్కనున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు దర్శకుడు బాబీ కొల్లి.ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తి కాగా, ప్రస్తుతం ఇతర కీలక పాత్రల కోసం నటీనటుల ఎంపికలో టీమ్ బిజీగా ఉంది. ఈ మూవీకి కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) బ్యానర్‌పై వెంకట్ కె.నారాయణ, లోహిత్ ఎన్.కే భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. గతంలో చిరంజీవి-బాబీ కాంబినేషన్‌లో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అదే నమ్మకంతో ఈసారి మరింత పవర్‌ఫుల్ మాస్ ఎలిమెంట్స్‌తో చిరంజీవిని చూపించబోతున్నారని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు ఫుల్ మాస్ ట్రీట్ ఉంటుందని టాక్.

National Award Winner Priyamani to Romance Chiranjeevi Bobby Kolli s Big Casting Plan Creates Buzz

చిరు-బాబీ కాంబో మూవీలో మరోసారి గెస్ట్ రోల్ ప్లాన్‌ను బాబీ డిజైన్ చేస్తున్నారట. గతంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన మన శంకర వరప్రసాద్ గారులో విక్టరీ వెంకటేష్ స్పెషల్ అప్పియరెన్స్ ఎంతటి హైప్ తెచ్చిందో తెలిసిందే. అదే తరహాలో ఈ సినిమాలో కూడా సెకండ్ హాఫ్‌లో దాదాపు 20 నిమిషాల పాటు ఓ యంగ్ హీరో కీలకంగా కనిపించనున్నాడు అనే టాక్ వినిపిస్తోంది. తొలుత తమిళ హీరో కార్తీ పేరు వినిపించినా, ఇప్పుడు తెలుగు యంగ్ హీరోనే తీసుకోవాలనే ఆలోచనలో బాబీ ఉన్నారని సమాచారం. ఈ పాత్ర మొత్తం ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ లో ఉంటుందట.

ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో మరో ముఖ్యమైన హైలైట్‌గా యంగ్ హీరోయిన్ ఎంట్రీ పై చర్చ జరుగుతోంది. ఉప్పెన తో బ్లాక్‌బస్టర్ అందుకున్న కృతి శెట్టికి ఈ సినిమాలో కీలక పాత్ర దక్కినట్లు టాక్. చిరంజీవికి జోడీగా కాకుండా, ఆయన కూతురు పాత్రలో కృతి కనిపించనున్నారని సమాచారం. తండ్రి-కూతురు సెంటిమెంట్ చుట్టూ కథ నడుస్తుందని, ఎమోషనల్ డ్రామాతో పాటు మాస్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని ఫిల్మ్‌నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ అంగిల్ అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది.

ఇక అసలు హాట్ టాపిక్ విషయానికి వస్తే.. చిరంజీవికి జోడీగా నేషనల్ అవార్డ్ విన్నర్ బ్యూటీ ఎంపిక ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో చిరు భార్య పాత్రకు ప్రియమణిని ఫైనల్ చేసినట్లు సమాచారం. నేషనల్ అవార్డ్ గెలిచిన నటి అయిన ప్రియమణి, చిరంజీవితో ఇప్పటివరకు స్క్రీన్ షేర్ చేయలేదు. అందుకే ఈ సరికొత్త కాంబినేషన్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. కథకు బలం చేకూర్చే పాత్రగా ప్రియమణి క్యారెక్టర్ డిజైన్ చేశారనే టాక్ కూడా వినిపిస్తోంది. బాబీ అసలు ప్లాన్ ఇదేనా? చిరుకు పర్ఫెక్ట్ జోడీగా స్ట్రాంగ్ పెర్ఫార్మర్‌ను పెట్టాలనే ఆలోచనతోనే ఈ ఎంపిక జరిగిందా? అన్న చర్చ నడుస్తోంది.

ఇతర నటీనటుల విషయానికి వస్తే, మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ఒక కీలక పాత్రలో కనిపించే అవకాశముందన్న ఊహాగానాలు కూడా జోరుగా ఉన్నాయి. సంగీత దర్శకుడిగా లెజెండ్ ఏ ఆర్ రెహామన్ ను తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తలు ఈ ప్రాజెక్ట్‌కు మరింత క్రేజ్ తెస్తున్నాయి. ఇలా చిరంజీవి మూవీపై రూమర్లు, క్యాస్టింగ్ వార్తలు ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. చిరుకు జోడీగా ప్రియమణి ఎంపిక నిజమైతే బాబీ ప్లాన్ పూర్తిగా క్లియర్ అయినట్టేనా? అన్నది అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. కానీ ఇప్పటివరకు వినిపిస్తున్న సమాచారం మాత్రం ఈ ప్రాజెక్ట్‌ను ఇప్పటి నుంచే టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మార్చేస్తోంది.

More from Filmibeat

Read more about: bobby kolli chiranjeevi priyamani
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X