Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
స్టార్ డైరెక్టర్ శిష్యుడికి నాని గ్రీన్ సిగ్నల్.. మళ్ళీ డబుల్ యాక్షన్?
న్యాచురల్ స్టార్ నాని లాక్ డౌన్ లో ఖాళీగా ఉండకుండా ఫ్యూచర్ ప్లాన్ ని బాగానే సెట్ చేసుకున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా వరుసగా కథలను విన్న నాని దాదాపు నాలుగైదు కథలను లైన్ లో పెట్టె ఆలోచనలో ఉన్నాడట. మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో చేసిన V సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే.
నెక్స్ట్ నిన్ను కోరి దర్శకుడు శివ నిర్వాణతో టక్ జగదీష్ అనే సినిమాతో బిజీ కానున్నాడు. అనంతరం టాక్సీ వాలా దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ తో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అలాగే బ్రోచేవారేవరురా డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో కూడా నాని ఒక కామెడీ ఎంటర్టైనర్ కథలో నటించనున్నాడు. ఇవన్నీ కాకుండా సుకుమార్ శిష్యుడికి కూడా నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
రంగస్థలం సినిమాకు సుకుమార్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన శ్రీకాంత్ అనే యువకుడు ఇటీవల నానిని కలిసి ఒక కథ చెప్పాడట. సుకుమార్ కూడా శ్రీకాంత్ పనితనం బావుంటుందని చెప్పడంతో నాని పాజిటివ్ గా స్పందించాడట. కథలో రెండు విభిన్నమైన షేడ్స్ ఉండడంతో నానికి కూడా బాగా నచ్చేసిందట. మరోసారి డబుల్ యాక్షన్ చూపించబోతున్నాడా అనే కామెంట్స్ వస్తున్నాయి. త్వరలోనే నాని తన తదుపరి ప్రాజెక్టులపై క్లారిటీ ఇవ్వనున్నాడు.