twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాకిస్తోన్న నేచురల్ స్టార్ నాని రెమ్యూనరేషన్: ఏకంగా అంత పెంచేసిన టాలెంటెడ్ హీరో

    |

    సినిమాల మీద ఉన్న పిచ్చితో క్లాప్ అసిస్టెంట్‌గా కెరీర్‌ను ఆరంభించి.. ఆ తర్వాత అసిస్టెంట్‌గా డైరెక్టర్‌గా పని చేసి.. అనంతరం 'అష్టాచమ్మా' అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు నాని. సహజ సిద్ధమైన నటనతో ఆకట్టుకుంటూ కెరీర్ ఆరంభంలోనే నటుడిగా గుర్తింపును తెచ్చుకున్నాడు. అదే సమయంలో కొన్ని విజయాలను కూడా అందుకున్నాడు. సుదీర్ఘమైన కెరీర్‌లో పరాజయాలను ఎదుర్కొన్నప్పటికీ.. ఎన్నో సినిమాలను వన్ మ్యాన్ షోగా మార్చుకుని సత్తా చాటాడు. ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడీ టాలెంటెడ్ స్టార్ హీరో.

    'నిన్ను కోరి' వంటి సూపర్ డూపర్ హిట్ మూవీ తర్వాత నాని - శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం 'టక్ జగదీష్'. ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాను షైస్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, పెద్ది హరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో టాలెంటెడ్ హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ నటిస్తున్నారు. ఇది ఏప్రిల్ 16న విడుదల కానుంది. ఈ చిత్రం పట్టాలపై ఉండగానే ఈ టాలెంటెడ్ హీరో 'శ్యామ్ సింగరాయ్', 'అంటే.. సుందరానికీ' అనే సినిమాలనూ ప్రారంభించేశాడు. ఈ నేపథ్యంలో నాని గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

    Natural Star Nani Remuneration Hike

    తాజా సమాచారం ప్రకారం.. నేచురల్ స్టార్ నాని త్వరలోనే సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. వచ్చే ఆగస్టు నుంచి ఇది ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన రాలేదు కానీ, ఈ చిత్రానికి గానూ నాని తీసుకునే రెమ్యూనరేషన్ వివరాలు బయటకు వచ్చాయి. ఇప్పటి వరకూ ఒక్కో సినిమాకు రూ. 10 కోట్లు చార్జ్ చేస్తున్న అతడు.. సుధాకర్ నిర్మించబోయే దానికి మాత్రం ఏకంగా రూ. 14 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

    English summary
    Ghanta Naveen Babu, known professionally as Nani, is an Indian film actor, producer, and television presenter primarily known for his work in Telugu cinema. Nani made his film debut with the 2008 romantic comedy Ashta Chamma and went on to star in many commercially successful films.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X