Don't Miss!
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Sports టీ20 వరల్డ్ కప్‌లో ధోనీ రీఎంట్రీ: బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్‌తో నాయిస్ స్మార్ట్‌వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్‌తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
షాకిస్తోన్న నేచురల్ స్టార్ నాని రెమ్యూనరేషన్: ఏకంగా అంత పెంచేసిన టాలెంటెడ్ హీరో
సినిమాల మీద ఉన్న పిచ్చితో క్లాప్ అసిస్టెంట్‌గా కెరీర్‌ను ఆరంభించి.. ఆ తర్వాత అసిస్టెంట్‌గా డైరెక్టర్‌గా పని చేసి.. అనంతరం 'అష్టాచమ్మా' అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు నాని. సహజ సిద్ధమైన నటనతో ఆకట్టుకుంటూ కెరీర్ ఆరంభంలోనే నటుడిగా గుర్తింపును తెచ్చుకున్నాడు. అదే సమయంలో కొన్ని విజయాలను కూడా అందుకున్నాడు. సుదీర్ఘమైన కెరీర్లో పరాజయాలను ఎదుర్కొన్నప్పటికీ.. ఎన్నో సినిమాలను వన్ మ్యాన్ షోగా మార్చుకుని సత్తా చాటాడు. ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడీ టాలెంటెడ్ స్టార్ హీరో.
'నిన్ను కోరి' వంటి సూపర్ డూపర్ హిట్ మూవీ తర్వాత నాని - శివ నిర్వాణ కాంబినేషన్లో వస్తోన్న చిత్రం 'టక్ జగదీష్'. ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమాను షైస్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, పెద్ది హరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో టాలెంటెడ్ హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ నటిస్తున్నారు. ఇది ఏప్రిల్ 16న విడుదల కానుంది. ఈ చిత్రం పట్టాలపై ఉండగానే ఈ టాలెంటెడ్ హీరో 'శ్యామ్ సింగరాయ్', 'అంటే.. సుందరానికీ' అనే సినిమాలనూ ప్రారంభించేశాడు. ఈ నేపథ్యంలో నాని గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
తాజా సమాచారం ప్రకారం.. నేచురల్ స్టార్ నాని త్వరలోనే సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. వచ్చే ఆగస్టు నుంచి ఇది ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన రాలేదు కానీ, ఈ చిత్రానికి గానూ నాని తీసుకునే రెమ్యూనరేషన్ వివరాలు బయటకు వచ్చాయి. ఇప్పటి వరకూ ఒక్కో సినిమాకు రూ. 10 కోట్లు చార్జ్ చేస్తున్న అతడు.. సుధాకర్ నిర్మించబోయే దానికి మాత్రం ఏకంగా రూ. 14 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.