Don't Miss!
- News గన్నవరం వైసీపీపై తాజా నివేదిక..వల్లభనేని వంశీ పరిస్థితి ఎలా ఉందంటే..?
- Sports ఛాంపియన్‌లా వస్తున్నాం.. ఇది ఆరంభం మాత్రమే - పంత్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
వామ్మో ఆ డైరెక్టరా? జర జాగ్రత్త నాని.. నిన్ను కోరి ముందు ఫ్యాన్స్ ఆందోళన
టాలీవుడ్లో నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్ సొంతం చేసుకొన్న నాని తాజాగా నిన్ను కోరి అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
టాలీవుడ్లో నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్ సొంతం చేసుకొన్న నాని తాజాగా నిన్ను కోరి అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. నివేద థామస్, ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం జూలై 7న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ దర్శకుడు రూపొందించే చిత్రాన్ని అంగీకరించడంపై ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సముద్రఖనితో సినిమాకు గ్రీన్ సిగ్నల్
తమిళంలో హీరో శశికుమార్, దర్శకుడు సముద్రఖని కాంబినేషన్లో ఓ సినిమాకు రంగం సిద్ధమైంది. ఈ చిత్రాన్ని ద్విభాషా చిత్రంగా రూపొందించాలనే ప్లాన్ ఉన్నారు. తమిళంలో శశికుమార్ హీరో కాగా, తెలుగులో నాని అయితే బాగుంటుందనే ఆలోచనకు వచ్చారట. ఈ మేరకు నానితో వారు సంప్రదింపులు కొంతకాలంగా జరుపుతున్నారు. వారి ప్రతిపాదనకు నాని సానుకూలంగా స్పందించినట్టు వార్తలు బయటకు వచ్చాయి.
జెండాపై కపిరాజుతో చేదు అనుభవం
ఈ వార్తల నేపథ్యంలో నాని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో నాని సముద్రఖని దర్శకత్వంలో జెండా పై కపిరాజు చిత్రంలో నటించారు. ఆ చిత్రం నానికి అనేక సమస్యలు తెచ్చిపెట్టింది. రిలీజ్ పలుమార్లు వాయిదా పడింది. చివరికి విడుదలైన ఆ సినిమా దారుణమైన ఫ్లాప్‌ను మూటగట్టుకొన్నది. తన కెరీర్లో నానికి చేదు అనుభవాన్ని మిగిల్చింది.
మళ్లీ అదే రిపీట్ అయితే..
జెండాపై కపిరాజు మిగిల్చిన చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని నాని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారట. సముద్రఖని సినిమా గురించి ఓ సారి ఆలోచించాలని గుర్తు చేస్తున్నారట. అయితే ఇంకా ఆ సినిమా ఎలాంటి క్లారిటీ లేదనేది తాజా సమాచారం.
వేణు శ్రీరాంతో మిడిల్ క్లాస్ అబ్బాయి
ఇదిలా ఉండగా వరుస సక్సెస్‌లతో జోరు మీద ఉన్న నాని ప్రస్తుతం వేణు శ్రీరాం దర్శకత్వంలో మిడిల్ క్లాస్ అబ్బాయి అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ షూటింగ్ వేగంగా జరుగుతున్నది. ఇప్పటికే ఈ సినిమాపై మంచి టాక్ వచ్చింది. మీడియాలో మంచి స్పందన కనిపిస్తున్నది. నిన్ను కోరి సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.
జాగ్రత్తగా చిత్రాల ఎంపిక..
సినిమాలు, దర్శకుల ఎంపికపై ఇప్పటి వరకు నాని చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. వేణు శ్రీరాం సినిమా తర్వాత దర్శకులు మేర్లపాక గాంధీ, హను రాఘవపూడి చిత్రాలు పరిశీలనలో ఉన్నాయి. ఈ మధ్యలోనే సముద్రఖని సినిమా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వరుస విజయాలు ఖాతాలో పడుతున్న సమయంలో నాని తప్పుడు నిర్ణయం తీసుకొంటారా అనే ఆందోళనను ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.