నానికి తల్లిగా గ్లామర్ హీరోయిన్.. విలన్ గా స్టార్ హీరో..

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, తొలుత అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి.. ఆ తరువాత నటుడిగా మారారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. వరుస హిట్లు అందుకున్నారు. ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లోస్టార్ హీరోగా రాణిస్తున్నారు. అతడే న్యాచురల్ స్టార్ నాని. వరుస విజయాలతో సూపర్ ఫామ్ లో ఉన్న నాని త్వరలో మరో కొత్త సినిమాతో ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో నాని తల్లిగా అలనాటి గ్లామర్ హీరోయిన్ నటించబోతుందట. అలాగే ఇందులో అదే సినిమాలో ప్రతి నాయకుడిగా టాలీవుడ్ స్టార్ హీరో నటించబోతున్నారట. ఇంతకీ ఆ మూవీ ఏంటి? ఆ స్టార్ యాక్టర్స్ ఎవరు? ఓ లూక్కేయండి.

నాచురల్ స్టార్ నాని.. ఇది పేరు మాత్రమే కాదు ఓ బ్రాండ్. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నాని. అసిస్టెంట్ డైరెక్టర్ గా తన సినీ ప్రస్తానాని మొదలుపెట్టిన నాని.. ప్రస్తుతం స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. కేవలం నటుడుగానే కాకుండా నిర్మాతగా వ్యవహరిస్తూ విజయాలను అందుకుంటున్నాడు. గత ఏడాది దసరా అనే బ్లాక్ బస్టర్ మూవీ నుండి ప్రారంభమైన ఆయన విజయపరంపర వరుస హిట్స్ దూసుకు వెళ్తున్నాడు. త్వరలో 'ది పారడైజ్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు

Natural star Nani Upcoming movie The Paradise Mohan Babu play the villain Role heroine Ramya Krishna will play the hero s mother

నాచురల్ నాని చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరి కాంబోలో తెరకెక్కిన దసరా ఎలాంటి బ్లాక్ హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి కాంబో ది పారడైజ్ సినిమాతో మరోసారి రిపీట్ కాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. ఈ సినిమాలోని క్యారెక్టర్ల కోసం మూవీ యూనిట్ వెతుకుతుందట. అందులో భాగంగానే.. ఈ సినిమాలో హీరో తల్లిగా బాహుబలి ఫేమ్, అలనాటి నటి రమ్యకృష్ణ ను ఈ సినిమా కోసం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే రమ్యకృష్ణ ను సంప్రదించారట మూవీ మేకర్స్. ఆమె కథ చెప్పగా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. రమ్యకృష్ణ ఇప్పటికే టాలీవుడ్ లో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, సపోర్ట్ రోల్ లలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కారణంగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల .. నటి రమ్యకృష్ణ సంప్రదించగా అందుకు రమ్యకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయం ఇలా ఉండగా రమ్యకృష్ణ ఇటీవల ప్రముఖ హీరో రాజ్ తరుణ్ నటించిన 'పురుషోత్తముడు 'అనే సినిమాలో నెగిటివ్ షెడ్ లో రమ్యకృష్ణ నటించిన విషయం తెలిసిందే.

Natural star Nani Upcoming movie The Paradise Mohan Babu play the villain Role heroine Ramya Krishna will play the hero s mother

ఇక ఇలా ఉంటే ఈ మూవీలో నెగటివ్ షేడ్ అంటే విలన్ పాత్రలో అలనాటి టాలీవుడ్ స్టార్ హీరో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (MOHAN BABU) నటించబోతున్నరట. ఈ మేరకు మూవీ మేకర్స్ ఆయన సంప్రదించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మోహన్ బాబు.. కన్నప్ప సినిమాలో ఓ గెస్ట్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్ ను కన్నప్ప టీం విడుదల చేసింది. అంత ముందుకు హీరో ప్రభాస్ సినిమాలో కూడా మోహన్ బాబు నెగిటివ్ షెడ్డు ఉన్న పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇలా నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న సినిమాలో అటు రమ్యకృష్ణ ఇటు మోహన్ బాబు ఇద్దరూ నటిస్తున్నారని టాక్. అయితే ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X