»   » విశాఖలో మెగాస్టార్‌ చిరంజీవికి ట్రీట్మెంట్.... అంతా రహస్యం?

విశాఖలో మెగాస్టార్‌ చిరంజీవికి ట్రీట్మెంట్.... అంతా రహస్యం?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Chiranjeevi Trying To Look A Bit Younger

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలను పూర్తిగా దూరం పెట్టారు. ఇక సినిమాల్లోనే కొనసాగాలని డిసైడ్ అయ్యారు. రాజ్య సభ ఎంపీగా ఉండి కూడా ఆయన ఇటీవల కేంద్ర బడ్జెట్ మీదగానీ, ఏపీకి జరుగుతున్న అన్యాయంపైగానీ స్పందించలేదు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా ఆయన గురువారం జరిగిన ఏపీ బంద్‌లో కూడా పాల్గొనలేదు. ప్రస్తుతం చిరంజీవి దృష్టంతా తన తాజా చిత్రం 'సైరా' మీదనే ఉంది. ఈ సినిమా కోసం ఆయన పిట్‌నెస్ పరంగా, లుక్ పరంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

విశాఖలో చిరంజీవికి ట్రీట్మెంట్

విశాఖలో చిరంజీవికి ట్రీట్మెంట్

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ట్రీట్ మెంట్ కోసం త్వరలోనే చిరంజీవి వైజాగ్ వెళుతున్నట్లు తెలుస్తోంది. నేచురోపతి ట్రీట్ మెంట్ కోసం ఆయన అక్కడకు వెళ్లబోతున్నారని టాక్.

ఎందుకీ చికిత్స?

ఎందుకీ చికిత్స?

‘సైరా' సినిమాలో చిరంజీవి యంగ్ లుక్‌తో కనిపించాలి. ఇందులో భాగంగానే ఆయన ఈ ట్రీట్మెంట్ తీసుకోబోతున్నారట. ఈ చికిత్స ద్వారా శరీరం కాంతివంతం అవుతుందని, స్కిన్ రేడియేట్ అవుతుందని అంటున్నారు.

అంతా రహస్యంగా...

అంతా రహస్యంగా...

అయితే ఈ ట్రీట్మెంట్ విషయాన్ని యూనిట్ సభ్యులతో పాటు, చిరంజీవి కుటుంబ సభ్యులు గోప్యంగా ఉంచుతున్నారు. బయటకు తెలిస్తే దీని గురించి మీడియాలో రకరకాల ప్రచారం జరుగుతుందనే ఉద్దేశ్యంతోనే ఇలా చేసినట్లు సమాచారం.

 శరవేగంగా షూటింగ్

శరవేగంగా షూటింగ్

‘సైరా' చిత్రం కాస్త లేటుగా ప్రారంభం అయినా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తవ్వగా..... ఫిబ్రవరి నుండి నుండి సెకండ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. మెగా తనయుడు రామ్ చరణ్ చిత్ర నిర్మాణ బాధ్యతలను దగ్గరుండి చూసుకుంటున్నారు.

 అంచనాలు భారీగా

అంచనాలు భారీగా

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. కన్నడ నటుడు సుదీప్, తమిళ నటుడు విజయ్ సేతుపతి, నయనతార, జగపతిబాబు, అమితాబ్ బచ్చన్ లాంటి అగ్రనటులు నటిస్తున్నారు.

 నేషనల్ లెవల్లో 150 కోట్ల ఖర్చుతో

నేషనల్ లెవల్లో 150 కోట్ల ఖర్చుతో

కొణిదెల ప్రొడక్షన్స్‌లో 150 కోట్ల బడ్జెట్‌తో సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని రామ్ చరణ్ తెరకెక్కిస్తున్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నేషనల్ లెవల్లో ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2019 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తెచ్చే అవకాశం ఉంది.

English summary
Megastar Chiranjeevi will head to Vishakapatnam for one week later this month. The Megastar will undergo the naturopathy treatment there which will make a person look a bit younger than the age and the treatment will also bring a glow to the skin.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu