మంత్రి కుమార్తె కోసమే నవదీప్ గొడవ?
గతంలోపలు సార్లు మద్యం మత్తులో గొడవలు చేసి పోలీసు రికార్డులకెక్కిన సినీ హీరో నవదీప్ తాజాగా మరోసారి ఓ దాడి కేసులో పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. ఇంజనీరింగ్ విద్యార్థిపై నవదీప్ దాడి చేసినట్లు ఆరోపలు ఉన్నాయి.
అయితే నవదీప్ మాత్రం ఇది నిజం కాదంటున్నాడు. ఇద్దరు కుర్రాళ్లను నేను కొట్టానని వస్తున్న వార్తల్లో నిజం లేదని, తెలంగాణ ఇష్యూలో భాగంగానే కొంతమంది నాపై ఇలా దుష్ర్పచారం చేస్తున్నారని తన ట్విట్టర్ లో పేర్కొన్నాడు.
అసలేం జరిగింది?
నోవాటెల్ హోటల్‌లో దిల్‌రాజు శ్రేయోభిలాషులకు పార్టీ ఇచ్చాడు. నవదీప్ తన గర్ల్ ఫ్రెండ్, మరో స్నేహితుడితో కలిసి అక్కడికి వెళ్లాడు. అదే హటల్ కు వచ్చిన కొందరు ఇంజనీరింగ్ విద్యార్థులు నవదీప్ లేని సమయంలో అతని గర్ల్ ఫ్రెండ్ తో గొడవ పడ్డారట. అనంతరం అక్కడి నుంచి సదరు విద్యార్థులు వెళ్లి పోయినట్లు తెలసింది. తర్వాత నవదీప్ తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి కార్లో బయల్దేరాడు. మాదాపూర్ లో ఓ చోట సదరు విద్యార్థులు కనిపించడంతో వారితో గొడవకు దిగిన నవదీప్ వారిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. అనంతరం నవదీప్, సదరు విద్యార్థులు పోలీస్ స్టేషన్ లో పరస్పరం ఫిర్యాదులు చేస్తుకున్నారు.
విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం నవదీప్ గర్ల్ ఫ్రెండ్ గా చెప్పబడుతున్న అమ్మాయి ఓ కేబినెట్ మంత్రి కూతురని సమాచారం. పోలీసుల వద్ద తాను మంత్రిగారి కూతురుగా పరిచయం చేసుకున్నట్లు తెలిసింది.


Click it and Unblock the Notifications











