నవనీత్ కౌర్ నకరాలు
ఏ మెగుడూ లేక పోతే అక్క మొగుడే దిక్కు అన్నట్లు తయారైంది నవనీత్ కౌర్ పరిస్థితి. చేతిలో చెప్పకోవటానికి ఒక్క సినిమా లేక పోయేసరికి 'భూమా' అంటూ కొత్త వాళ్ళతో చేస్తున్న ఓ చిన్న బడ్జెట్ ఫిల్మ్లో యాక్ట్ చేసి దాని గురించి విసుగు పుట్టేలా వివరిస్తోంది. సినీ రంగ ప్రవేశం చేసి యేళ్లు గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగళిలా ఉందామె కెరీయర్. సైడు బిజినెస్ గా చేస్తున్న రియల్ ఎస్టేటు వ్యాపారమే ఆమెకు బాగా కలిసివచ్చింది . కళామతల్లి కరుణ మాత్రం కలుగలేదు. 'శ్రీను..వాసంతి ..లక్ష్మి' సినిమా తరువాత ఆ మాత్రం హైప్ క్రియేట్ చేసే సినిమా కూడా పడలేదు. 'గుడ్ బోయ్' వంటి ఫ్యామిలీ కామెడీలు కూడా వర్కవుట్ కాలేదు. ఒకటి అరా తెగించి చేసిన ఐటం సాంగులు సైతం వికటించాయి.దాంతో ఫేడవుట్ అయ్యి పరిశ్రమకు దూరమవుతున్న మాజీల లిష్టులోకి చేరింది. ఇంతలో 'భూమా' అనే సినిమా ఆఫర్ వచ్చింది. అదిత్ శ్రీనివాస్ ని హీరోగా పరిచయం చేస్తున్న ఈ సినిమా చాలా కాలం ఆగి త్వరలో రిలీజు అవబోతోంది. దాంతో నవనీత్ కౌర్ఎక్కడ లేని ఉషారు తెచ్చుకుని అందులో నాది చాలా గ్లామర్ పాత్ర, యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయంటూ కనపడిన వాళ్ళకి, ఫోన్ లిప్ట్ చేసే వాళ్ళకి ఆపకుండా చెప్తూ ఊదరకొడుతోందిట. దీని సంగతి సర్లే గాని ఆ మధ్య 'బ్రేకింగ్ న్యూస్' అంటూ నీతో ఓ హిందీ సినిమా ఫ్రీమేక్ చేస్తున్నారన్నావు దాని సంగతేమయింది? అంటే ఇప్పడే వస్తానంటూ జంప్ ట!.ఎందుకంటే అదీ ఆగిపోయిందిట, పాపం.


Click it and Unblock the Notifications











