బన్నీ మీదే ఆశలన్నీ!
హీరోగా కెరీర్ స్టార్ట్ చేసినా... వరుసగా ఏడెనిమిది సినిమాల్లో నటించినా నవదీప్ మాత్రం వెలగలేక పోయాడు. హీరో నుంచి సైడ్ హీరో, గెస్ట్ ఆర్టిస్ట్ స్థాయికి దిగిన నవదీప్ ఇప్పుడు 'ఆర్య 2" నే నమ్ముకున్నాడు. తన క్లోజ్ ఫ్రెండ్ బన్నీతో కలిసి నటిస్తోన్న ఈ చిత్రం తనకు కచ్చితంగా పెద్ద బ్రేక్ ఇస్తుందని నవదీప్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నాడు. ఇటు నవదీప్ మాత్రమే కాకుండా ఈ సినిమాపై మరోకరు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికి నాలుగు సినిమాల్లో నటించినా ఇంకా సరయిన గుర్తింపు రాని శ్రద్ద దాస్ 'ఆర్య 2" లో ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఇంతవరకు నటించిన చిత్రాలన్నీ ఒకెత్తు...ఇదోక్కటీ అంతకంటే ఎత్తు అని ఫీలౌతోన్న శ్రధ్ద ఆశలని 'ఆర్య 2" ఎంత వరకు శాటిస్ ఫై చేస్తుందో చూడాలి.
More from Filmibeat
arya 2 allu arjun navdeep kajal shraddha das sukumar ఆర్య2 అల్లు అర్జున్ నవదీప్ కాజల్ శ్రద్ద దాస్ సుకుమార్


Click it and Unblock the Notifications











