నవదీప్ పార్టీలపై ..'ఆర్య-2' ఎఫెక్టు?
ప్రీక్వెంట్ గా పబ్ లలో పార్టీలు ఇస్తూ,పాల్గొంటూ ఎంజాయ్ చేసే నవదీప్ గత కొద్ది రోజులగా అసలు అటువైపే వెళ్ళటం లేదు. దానికి కారణం ఆర్య-2 పరాజయమేనంటున్నారు ఫిల్మ్ వర్గాలు. ఎంత కాదనుకున్నా ఆ టాపిక్కే ఎక్కడకెళ్ళినా వస్తోందనే కొంత కాలం పాటు పార్టీలను ఎవాయిడ్ చేసినట్లు చెప్తున్నారు. అయితే అదేం కాదు అతను ప్రస్తుతం ఓం శాంతి చిత్రంలో బిజీగా ఉండటమే కారణమని కొందరు సర్ధిచెప్తున్నారు. ఆర్య-2 లో నవదీప్ క్యారెక్టర్ నుంచిఎంతో ఎక్సపెక్ట్ చేసిన వారికి నిరాశే మిగిల్చింది. అప్పుడప్పుడూ కనపడి,అతి తక్కువుగా మాట్లాడుతూ పెద్ద ఇంపాక్ట్ కలగచేయలేకపోయాడు. అయితే చాలా కాలం పాటు ఈ చిత్రం కోసం అతని డేట్స్ వెచ్చించాడు. అందుకోసం అతను కొన్ని సినిమా ఆపర్స్ సైతం కోల్పోయాడు. చందమామ తర్వాత వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకోకుండా ఈ చిత్ర విజయం కోసం ఎదురు చూడటం దెబ్బతీసిందంటున్నారు. వీటికి తోడు భూమిక సరసన చేసిన యోగం చిత్రం కూడా ఎంతకీ ఫూర్తి కాకపోవటం, రిలీజ్ డేట్ ఫిక్స్ చేయకపోవటం ఇబ్బందికర అంశమే.


Click it and Unblock the Notifications











