బన్నీకి విలన్‌గా యంగ్ హీరో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్స్

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ ఎంత సక్సెస్‌ఫుల్ అయిందో అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరి కలయికలో గతంలో 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఈ రెండింటి తర్వాత వీళ్ల కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కుతోంది. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

ఈ సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. ఇందులో యంగ్ హీరో నవదీప్ నటిస్తున్నాడన్న విషయం గతంలోనే తెలిసింది. అయితే, ఈ సినిమాలో అతడే విలన్ అని ఇప్పుడు ఓ వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. దీనికి కారణం ఈ మధ్య నవదీప్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేయడమే. ఇంతకీ ఆ ఫొటోలు ఏంటనేగా సందేహం. అవి.. అతడి సిక్స్ ప్యాక్‌కు సంబంధించినవి.

Navdeep Will paly opposite Role to Allu Arjun

అవును.. నవదీప్ ఈ మధ్య తన సిక్స్ ప్యాక్ బాడీకి సంబంధించిన కొన్ని ఫొటోలను షేర్ చేశాడు. అంతేకాదు, తను ఇలా మారడానికి ట్రైనర్‌తో పాటు అల్లు అర్జున్, రానా దగ్గుబాటి సహా పలువురు తనకు ఆదర్శంగా నిలిచారని చెప్పుకొచ్చాడు. దీంతో బన్నీ సినిమాలో విలన్ అతడేనన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు, ఈ సినిమా అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే, నివేదా పేతురాజ్, సీనియర్ హీరోయిన్ టబు సహా పలువురు కీలక నటులు నటిస్తున్నారు.

తండ్రి సెంటిమెంట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుందని వార్తలు వస్తున్నాయి. దీనికి 'నాన్న నేను' అని పెడుతున్నారని ప్రచారం జరుగుతోంది. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్‌లోనే వచ్చిన 'సన్నాఫ్ సత్యమూర్తి' కూడా తండ్రి సెంటిమెంట్‌తోనే వచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమా కూడా అంతకు మించి ఉంటుందని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X