చిరంజీవికి యంగ్ హీరో షాక్.. ఏకంగా మెగాస్టార్‌నే మోసం చేసేశాడా!
స్వయంకృషితో సినిమాల్లోకి వచ్చినా తనదైన యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, గ్రేస్ ఇలా అన్నింట్లోనూ మెప్పించి తెలుగు చిత్ర పరిశ్రమలో బిగ్గెస్ట్ హీరోగా ఎదిగిపోయారు మెగాస్టార్ చిరంజీవి. అలా దాదాపు నాలుగు దశాబ్దాలుగా హవాను చూపిస్తోన్న ఆయన.. ఇప్పుడు కూడా వేగంగా మూవీలు చేస్తున్నారు. ఇలా ప్రస్తుతం చిరంజీవి 'విశ్వంభర' అనే క్రేజీ సినిమాలో నటిస్తున్నారు.
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న సినిమానే 'విశ్వంభర'. సోషియో ఫాంటసీ జోనర్‌లో రూపొందుతోన్న ఈ మూవీపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు. అంతేకాదు, చిరంజీవి కెరీర్‌లోనే గతంలో ఎన్నడూ పెట్టనంత బడ్జెట్‌ను కేటాయించారు.

మెగాస్టార్ చిరంజీవి - మల్లిడి వశిష్ట కలిసి చేస్తున్న 'విశ్వంభర' సినిమాకు సంబంధించిన షూటింగ్ ఈ ఏడాదిలోనే మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ పలు షెడ్యూళ్లను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఇందులో చిరంజీవితో పాటు త్రిష మిగిలిన నటీనటులతో చిత్రీకరణ జరిపారు. మొత్తంగా ఈ సినిమాకు సంబంధించి 30 శాతం టాకీ పార్ట్ పూర్తి చేశారు.
ఐదు భాషల్లో రూపొందుతోన్న 'విశ్వంభర' సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం కోసం చాలా భాషలకు చెందిన నటీనటులను తీసుకుంటున్నారు. అయితే, ఇందులో ముఖ్యమైన పాత్ర కోసం టాలీవుడ్‌లోని ఓ యంగ్ హీరోను సెలెక్ట్ చేసుకున్నారు. అతడే విలక్షణ నటుడిగా పేరొందిన నవీన్ చంద్ర.

'విశ్వంభర' మూవీలో చిరంజీవికి ముగ్గురు చెల్లెల్లు ఉంటారు. వాళ్లలో ఒకరికి జోడీగా ఈ యంగ్ హీరో నటిస్తున్నాడు. అంటే.. అతడు మెగాస్టార్‌కు బావగా కనిపించబోతున్నాడు. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో నవీన్ చంద్ర.. చిరంజీవిని మోసం చేస్తాడట. ఈ సన్నివేశం కథను మలుపు తిప్పేలా ఉంటుందని తెలిసింది. అంటే అతడి రోల్ ఎంతో హైలైట్‌గా ఉంటుందని చెప్పొచ్చు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి.
ఇదిలా ఉండగా.. మెగాస్టార్ చిరంజీవి - వశిష్ట కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'విశ్వంభర' మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్‌గా.. సురభి, ఈషా చావ్లా కీలక పాత్రలను చేస్తున్నారు. దీనికి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశారు.


Click it and Unblock the Notifications











