రామ్ చరణ్‌కు యంగ్ హీరో షాక్.. మెగా ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ లీక్

సినీ రంగంలోకి ఎంతో మంది స్టార్ల వారసులు హీరోలుగా పరిచయం అయ్యారు. కానీ, అందులో కొందరు మాత్రమే పెద్ద రేంజ్‌కు ఎదిగారు. అలాంటి వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకడు. మెగాస్టార్ కుమారుడిగా వచ్చిన అతడు.. తనదైన టాలెంట్లతో సత్తా చాటుతున్నాడు. ఫలితంగా వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ గ్లోబల్ స్టార్‌గా ఎదిగిపోయి ఫుల్ జోష్‌తో దూసుకుపోతోన్నాడు.

ఈ మధ్య కాలంలో క్రేజీ సక్సెస్‌లతో యమా జోరు మీదున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు 'గేమ్ చేంజర్' అనే సినిమాను చేస్తున్నాడు. దిగ్గజ దర్శకుడు ఎస్ శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు.

Naveen Chandra Role Highlight in Ram Charan Game Changer Movie

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న 'గేమ్ చేంజర్' మూవీకి సంబంధించిన షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయినా మధ్యలో కొన్ని అనుకోని అవాంతరాలు వచ్చాయి. అయినప్పటికీ దీనికి సంబంధించిన 70 శాతానికి పైగా టాకీ పార్ట్ కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నారు. మిగిలిన దాన్ని కూడా పూర్తి చేసి ఈ ఏడాది చివర్లో దీన్ని విడుదల చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

రామ్ చరణ్ కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'గేమ్ చేంజర్' సినిమాలో ఎంతో మంది స్టార్లు కీలక పాత్రలను పోషిస్తున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర కూడా ఓ ముఖ్యమైన పాత్రను చేస్తున్నాడు. ఇప్పటికే ఈ విషయం బయటకు రాగా.. తాజాగా అతడి రోల్ గురించి క్రేజీ న్యూస్ లీక్ అయింది.

Naveen Chandra Role Highlight in Ram Charan Game Changer Movie

'గేమ్ చేంజర్' మూవీలో ఎస్‌జే సూర్య విలన్‌గా చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో నవీన్ చంద్ర కూడా నెగెటివ్ రోల్ చేస్తున్నాడట. అయితే, ముందు మంచిగా కనిపించే అతడి పాత్ర.. ఒక్కసారిగా వైల్డ్ మోడ్‌లోకి వెళ్తుందట. అప్పుడు వచ్చే ట్విస్ట్ మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంటుందని తెలిసింది. ముఖ్యంగా రామ్ చరణ్‌, నవీన్ చంద్ర కాంబినేషన్ సీన్స్ హైలైట్‌గా ఉంటాయని సమాచారం.

ఇదిలా ఉండగా.. 'గేమ్ చేంజర్' మూవీలో రామ్ చరణ్‌కు జోడీగా కియారా అద్వాణీ చేస్తోంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దీనికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, జయరాం, అంజలి, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X