స్టార్ హీరోయిన్‌తో నవీన్ పోలిశెట్టి రొమాన్స్... జాతిరత్నాలు సక్సెస్ ఎఫెక్ట్‌తో..
దక్షిణాది స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి మరోసారి విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఒక సినిమాకు మరో సినిమాకు గ్యాప్ తీసుకొంటున్న ఈ జేజమ్మ ఇప్పుడు యువ హీరోతో జతకట్టేందుకు సిద్ధమైనట్టు తెలుస్తున్నది. అనుష్కశెట్టి, యువ హీరో కాంబినేషన్‌లో వస్తున్న సినిమాను ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సినిమా వివరాల్లోకి వెళితే...

బాహుబలి తర్వాత రూట్ మార్చిన అనుష్క
బాహుబలి తర్వాత అనుష్క శెట్టి తన కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకొంటున్నారు. ఎక్కువ సినిమాల్లో నటించకుండా తన పాత్ర, కథకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలనే ఎంపిక చేసుకొంటున్నారు. బాహుబలి తర్వాత భాగమతి, సైరా, నిశ్శబ్దం చిత్రాల్లో మాత్రమే నటించడం ఆమె ప్రయారిటీ ఎమిటో స్పష్టమవుతున్నది.

యూవీ క్రియేషన్స్‌కు గ్రీన్ సిగ్నల్
నిశ్శబ్దం సినిమా తర్వాత కొత్తగా సినిమాలకు ఒకే చెప్పిన దాఖలాలు లేవు. అయితే యూవీ క్రియేషన్స్ రూపొందించే చిత్రంలో నటించడానికి అనుష్క శెట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అయితే తన వయసుకు తగిన పాత్ర తగినట్టుగా కథ ఉండటంతో వెంటనే ఆమె ఒప్పుకొన్నట్టు సమాచారం.

అనుష్కశెట్టితో నవీన్ పోలిశెట్టి
యూవీ క్రియేషన్స్ రూపొందించే చిత్రంలో యువ నటుడు నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్నట్టు తెలిసింది. జాతిరత్నాలు సినిమా విజయం తర్వాత నవీన్‌కు భారీగా ఆఫర్లు వస్తున్నాయనే వార్తల మధ్య యూవీ క్రియేషన్స్ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారనే వార్త ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

మెచ్యుర్డ్ లవ్‌స్టోరితో
యూవీ క్రియేషన్స్‌లో రూపొందబోయే కథ విషయానికి వస్తే.. మిడిల్ ఏజ్ వయసు ఉన్న యువతికి, ఓ యువకుడికి మధ్య జరిగే ప్రేమకథ అని తెలిసింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన విషయాలను యూనిట్ గొప్యంగా ఉంచుతున్నారు. త్వరలోనే అధికారికంగా వివరాలను ప్రకటించే అవకాశం ఉంది.

క్రేజీగా అనుష్క, నవీన్ పోలిశెట్టి కాంబినేషన్
బాహుబలి, నిశ్శబ్దం లాంటి ప్యాన్ ఇండియా చిత్రాలతో అనుష్క శెట్టి, చిచ్చోరే లాంటి హిందీ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకొన్న నవీన్ పోలిశెట్టి కాంబినేషన్‌పై సినీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఏది ఎలా ఉన్న ఇద్దరు టాలెంటెడ్ ఆర్టిస్టులతో వచ్చే సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











