అనుష్క శెట్టితో రొమాన్స్ తర్వాత.. మరో స్టార్ హీరోయిన్‌తో నవీన్ పొలిశెట్టి లవ్ ట్రాక్!
సౌత్ ఇండియా సినిమా దగ్గర ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్స్ కేవలం వ్యవధిలో వచ్చేస్తూ ఉంటారు. మరి అలా సౌత్ లో ఇప్పుడు హీరోయిన్స్ విషయంలో మరింత పోటీ నెలకొనగా పాటుగా తెలుగు సహా తమిళ సినిమా దగ్గర చెరగని ముద్ర వేసుకున్న టాప్ మోస్ట్ హీరోయిన్స్ కొందరు ఉన్నారు. కాగా గత రెండు దశాబ్దాల కితమే ఇండస్ట్రీలోకి వచ్చి అప్పటి స్టార్స్ తోని ఇప్పుడు స్టార్స్ తో కూడా వారు సినిమాలు చేసి సెపరేట్ మార్కెట్ ని సొంతం చేసుకున్నారు.
మరి ఈ హీరోయిన్స్ లో మన టాలీవుడ్ నుంచి అనుష్క శెట్టి, కోలీవుడ్ నుంచి నయనతార అలాగే త్రిష కృష్ణన్ లు ప్రధానంగా కనిపిస్తారు. కాగా ఈ ముగ్గురు కూడా ఇప్పుడు తమ రేంజ్ స్టార్స్ తో సినిమాలు చేస్తున్నారు కానీ అనుష్క ఇంకోపక్క నయనతార మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్నారని చెప్పొచ్చు. జెనరల్ గా హీరోలకి వచ్చినా తమ కంటే చిన్న హీరోయిన్స్ తో సినిమాలు చేస్తుంటారు అని హీరోయిన్స్ ఏజ్ పెరిగితే వాళ్ళని వేరే పాత్రలకి ఎంపిక చేస్తారు అంటూ పలువురు మహిళా నటులే మాట్లాడుతారు.

కాగా ఇప్పుడు ఈ ట్రెండ్ మారుతుంది అని చెప్పాలి. తనకంటే చిన్నవాడు అయిన యంగ్ హీరో నవీన్ పొలిశెట్టితో "మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి" అనే రోమ్ కామ్ సినిమా చేసింది. అయ్యితే ఇందులో రొమాన్స్ లాంటివి పెద్దగా లేవు కానీ ఇద్దరి వయసులో తేడా బాగానే కనిపిస్తుంది పైగా అలానే హిట్ కూడా అయ్యింది. అయితే ఇప్పుడు తాజాగా అనుష్క బాటలో మరో సీనియర్ నటి నయనతార గేర్ మార్చినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.
తమిళ్ లో తనకంటే చిన్నవాడు అయినా కెవిన్ తో నయన్ నెక్స్ట్ సినిమాలో రొమాన్స్ చేయనున్నట్టుగా ఇపుడు పలు గాసిప్స్ వినిపిస్తున్నాయి. కాగా ఇది మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి లాంటి సినిమాలా కాకుండా రొమాన్స్ కూడా గట్టిగానే ఉండే సినిమా అన్నట్టుగా టాక్. ఇప్పటికే నయన్ తన పెళ్లి తర్వాత స్కిన్ షో ని స్టార్ట్ చేసి సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇక ఇప్పుడు ఈ తరహా రోల్స్ కి కూడా ఓకే చెప్తుండడం గమనార్హం. కాగా ఈ చిత్రాన్ని అయితే ఇదవన్ విష్ణు అనే కొత్త దర్శకుడు చేయనున్నట్టుగా ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లో టాక్.

మరి నయన్ తీసుకున్న ఈ స్టెప్ ఎంతవరకు ఆమె కెరీర్ కి ప్లస్ అవుతుంది అనేది చూడాలి. కాగా నయన్ రీసెంట్ గానే బాలీవుడ్ ఎంట్రీ బిగ్ స్టార్ షారుఖ్ ఖాన్ తో "జవాన్" సినిమాలో కనిపించగా ఇప్పుడు తమిళ్ లో తన హిట్ చిత్రం అమ్మోరు తల్లి సీక్వెల్ అలాగే తనీ ఒరువన్ సీక్వెల్ లలో ఆమె నటిస్తుంది. అంతే కాకుండా కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ తో భారీ చిత్రం "గుడ్ బాడ్ అగ్లీ" సినిమాల్లో తాను నటిస్తుంది.


Click it and Unblock the Notifications











