తన కథను వేరే హీరోకు ఇచ్చేసిన మహేశ్: ఇద్దరికీ న్యాయం చేసేలా ప్లాన్ వేశాడు

'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి వరుస విజయాలతో ఫుల్ జోష్ మీదున్నాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ విజయ పరంపరను కొనసాగించేందుకు ప్రస్తుతం పరశురాంతో కలిసి 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. ఇది పట్టాలపై ఉండగానే దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేస్తున్నట్లు కూడా ప్రకటన వెలువడింది. అయితే, ఈ గ్యాప్‌లో మరో సినిమాను చేయాలని మహేశ్ డిసైడ్ అయ్యాడట. ఇందుకోసం వంశీ పైడిపల్లి, వెంకీ కుడుములతో కథా పరమైన చర్చలు కూడా జరిపాడని అప్పట్లో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

'సర్కారు వారి పాట' తర్వాత మహేశ్ బాబు ఎవరితో సినిమా చేస్తాడన్న దానిపై క్లారిటీ రాలేదు. కానీ, అతడి నిర్మాణంలో మరో సినిమా ఉంటుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. సూపర్ స్టార్ త్వరలోనే 'జాతి రత్నాలు' హీరో నవీన్ పోలిశెట్టితో ఓ సినిమాను నిర్మించబోతున్నాడట. దీనికి వెంకీ కుడుమల దర్శకత్వం వహించబోతున్నాడని తెలుస్తోంది. తన కోసం చెప్పిన కథనే నవీన్‌తో చేయమని మహేశ్ అతడికి సలహా ఇచ్చాడనే టాక్ వినిపిస్తోంది. నచ్చిన స్క్రిప్టు కావడం వల్లే ఈ సినిమాను స్వయంగా నిర్మిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.

Naveen Polishetty Venky Kudumula Movie Under Mahesh Babu Production

ప్రస్తుతం మహేశ్ బాబు 'సర్కారు వారి పాట'లో నటిస్తూనే... అడవి శేష్‌తో 'మేజర్' అనే సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఇది రిలీజ్ కాకముందే నవీన్ పోలిశెట్టితో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. దీనికి సంబంధించిన బ్యాగ్రౌండ్ వర్క్ మొత్తం పూర్తయిన తర్వాతనే అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. నవీన్ నటించిన 'జాతి రత్నాలు' సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. దీనికి దాదాపు రూ. 26 కోట్ల లాభాలు కూడా వచ్చాయి. ఈ జోష్‌లోనే మరో సినిమా కోసం సిద్ధం అవుతున్నాడతను.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X