‘నాయక్’పై దిల్‌రాజు సవతి ప్రేమ, రంగంలోకి అరవింద్?
హైదరాబాద్ : ఈ సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు పోటా పోటీగా బాక్సాఫీసు బరిలోకి దూకుతున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న 'నాయక్' చిత్రం కాగా, మరొకటి మహేష్ బాబు-వెంకటేష్ మల్టీ స్టారర్‌గా తెరకెక్కిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'.
తెలుగు సినిమాలకు కీలకమైన బిజినెస్ ఏరియా అయిన 'నైజాం'లో ఈ రెండు సినిమాలను ప్రముఖ నిర్మాత దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇందులో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రానికి దిల్ రాజు స్వయంగా నిర్మాత కూడా. ఈ నేపథ్యంలో నాయక్ చిత్రానికి థియేటర్ల కేటాయింపు విషయంలో దిల్ రాజు సవతి ప్రేమ చూపిస్తున్నాడనే ఆందోళన పలువురు అభిమానుల్లో వ్యక్తం అవుతోంది.
'నాయక్' సినిమా కంటే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రానికి ఎక్కువ థియేటర్లు కేటాయిస్తున్నారనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి. అదే జరిగితే రికార్డుల పరంగా, కలెక్షన్ల పరంగా 'నాయక్' చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం కంటే వెనకపడే అవకాశం ఉందనే ప్రాచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో రామ్ చరణ్ మామాయ్య, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ రంగంలోకి దిగాడని, తన పలుకుబడి ఉపయోగించి......'నాయక్' చిత్రానికి ఎక్కువ థియేటర్లు కేటాయించేలా పావులు కదుపుతున్నాడని టాక్. ఈ పరిణామాల నేపథ్యంలో సంక్రాంతి బరిలో ఎక్కువ థియేటర్లు ఏ సినిమాకు దక్కుతాయి? రికార్డుల పరంగా, కలెక్షన్ల పరంగా ఏ సినిమా నెం.1 పొజిషన్లో నిలుస్తుంది అనే చర్చమొదలైంది సినీ వర్గాల్లో...
నాయక్ చిత్రాన్ని యూనివర్సల్ మీడియా సంస్థ నిర్మిస్తోంది. డి.వి.వి.దానయ్య నిర్మాత. రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్, అమలపాల్ రొమాన్స్ చేస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, రాహుల్ దేవ్, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్ రావత్, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, మాటలు: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కళ: ఆనంద్ సాయి, సంగీతం: తమన్, దర్శకత్వం: వివి వినాయక్.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్‌పై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. వెంకటేష్ సరసన జర్నీ ఫేం అంజలి మరో హీరోయిన్ రోల్ చేసింది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో ఈచిత్రాన్ని తెరక్కిస్తున్నారు. రోహిణి, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, రమా ప్రభ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్, సంగీతం: మిక్కీ జే మేయర్, సహనిర్మాతలు: శిరీష్-లక్ష్మణ్, పాటలు: సిరి వెన్నెల సీతారామశాస్త్రి.


Click it and Unblock the Notifications











