ప్రభు-నయన మధ్య దూరం పెరుగుతోందా?
ఇంత వరకు రంజు సాగిన ప్రభుదేవా, నయనతారల ప్రేమ వ్యవహారం...మరో ఆసక్తికర మలుపు తిరగబోతోందా? ప్రభుదేవాతో తన పెళ్లి తంతును విరమించుకునే దిశగా నయనతార అడుగులు వేస్తోందా? అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది చెన్నయ్ సినీ వర్గాల నుంచి. నమ్మశక్యంగా లేక పోయినా ఇది జరిగి తీరుతుందని నొక్కి వక్కానిస్తున్నారు తమిళ సినీ జనాలు.
తన ప్రియుడు ప్రభుదేవాను దక్కించుకోవడం కోసం ఎవరేమన్నా, ఎన్ని చివాట్లు పెట్టినా, ఛీకొట్టి దుమ్మెత్తి పోసినా భరించి... ఓపికతో కోర్టుల చుట్టూ తిరిగిన నయనతార ఇప్పడు ఇలా ఆలోచించడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రలు చేసిన బ్రెయిన్ వాష్ ఆమెపై బాగా పనిచేసిందనే వాదన వినిపిస్తోంది. దీంతో తన భవిష్యత్ ను ముందే ఊహించుకున్న ఆమె ప్రభుత్వంతో మూడు ముళ్లు వేయించుకుని జీవితాతం భాధ పడేకంటే, ఇప్పడు కళ్లు తెరిచి సరైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనే దిశగా ఆలోచన చేస్తోందట.
వాస్తవానికి నయన హిందూ మతంలోకి మారడం ఆమె సొంత నిర్ణయం అనుకున్నాం. కానీ వాస్తవం అదికాదని, దీని వెనక ప్రభుదేవా ఒత్తిడి కూడా ఉందనే వాదన వినిపిస్తోంది. ఫైగా తనకు ఇష్టమైన సినిమాల్లో నటించడానికి నోచెప్పాడు. చేస్తే గీస్తే శ్రీరామ రాజ్యం తరహాలో పవిత్రమైన పాత్రలు మాత్రమే చేయాలని కండీషన్ పెట్టాడు. ఈ కండీషన్స్ మూలంగా నయనలో కొత్త సందేహాలు మొదలయ్యాయి. ప్రభుదేవ తనపై ఆ...రకమైన అనుమానంతోనే సినిమాలపై ఆంక్షలు పెట్టాడని ఆమె భావిస్తోంది. ఇప్పడే సరైన నిర్ణయం తీసుకోకుంటే కెరియర్ స్పాయిల్ అవ్వడం ఖాయం అనేది నయనతార.
ఇంత కాలం మొదటి బార్యతో కాపురం చేసి పిల్లల్ని కూడా కన్నాడు. ఇప్పుడు ఆమెపై మోజు తీరి తనను పెళ్లి చేసుకుంటున్నాడు. రేపు నా పరిస్థితి కూడా అలా జరుగదని గ్యారంటీ ఏమిటని...తనను తానే ప్రశ్నించుకుంటోందట. అదే సమయంలో ఇంత జరిగాక మళ్లీ మనసు మార్చుకుంటే తనను జీవితంలో మరో తోడు దొరుకుందా? అనే భయం కూడా ఆమెను వెంటాడుతోంది. మరి ఈ నేపథ్యంలో నయన తార నిర్ణయం ఏ విధంగా ఉండ బోతోందో? చూడాలి...


Click it and Unblock the Notifications











